TSPSC Group 1 Prelims Question Paper With Key 2023: ముగిసిన ప్రిలిమ్స్ పరీక్ష.. కీ కోసం క్లిక్ చేయండి
గత ఏడాది రద్దైన ప్రిలిమనరీ పరీక్షతో పోల్చి చూస్తే ఈ రోజు నిర్వహించిన పరీక్ష కొంచెం కఠినంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. అభ్యర్థి ఇంటెలిజెన్స్‌ను పదును పెట్టేలా ప్రశ్నలు వచ్చినట్లు చెప్పారు.
ఈ సారి కటాఫ్ మార్కులు కొంచెం తక్కువగానే ఉండే అవకాశం ఉందని సబ్జెక్ట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉదయం 8.30 నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఆతర్వాత వచ్చిన వారిని ఆలస్యమైందంటూ.. పరీక్ష రాయటానికి అధికారులు అనుమతించలేదు.
హైదరాబాద్ మసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఓ అభ్యర్థి, సిద్దిపేటలో మరో అభ్యర్థి పరీక్ష రాయకుండానే వెళ్లాల్సి వచ్చింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కీ సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా తయారుచేయించింది. వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రొఫెసర్లతో ఈ కీని చేయించింది. అయితే ఈ కీ అభ్యర్థుల ప్రాథమిక అవగాహన కోసమే అని గుర్తుంచుకోగలరు. అంతిమంగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే కీని మాత్రమే అభ్యర్థులు అధికారికంగా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది