TSPSC Group 1 Prelims Question Paper 2023: ముగిసిన ప్రిలిమ్స్ పరీక్ష.. ప్రశ్నాపత్రం కోసం క్లిక్ చేయండి.. ప్రశ్నలు ఎలా వచ్చాయంటే...
గత ఏడాది రద్దైన ప్రిలిమనరీ పరీక్షతో పోల్చి చూస్తే ఈ రోజు నిర్వహించిన పరీక్ష కొంచెం కఠినంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. అభ్యర్థి ఇంటెలిజెన్స్‌ను పదును పెట్టేలా ప్రశ్నలు వచ్చినట్లు చెప్పారు.
TSPSC Group 1 Prelims: బూట్లు, ఫోన్లతో వస్తే గేటు బయటే... ఓన్లీ చెప్పులతో వస్తేనే అనుమతి
ఈ సారి కటాఫ్ మార్కులు కొంచెం తక్కువగానే ఉండే అవకాశం ఉందని సబ్జెక్ట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పరీక్షకు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి నుంచి అధికారులు నిబంధనలను అభ్యర్థులకు చేరవేశారు. కానీ, చాలా మంది అభ్యర్థులు ఉదాసీనంగా పరీక్ష కేంద్రాలకు వచ్చారు.
AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల డేట్ ఇదే... ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎంతంటే...
బూట్లు, ఆభరణాలు, ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చారు. వీటినన్నింటిని పరీక్ష కేంద్రం గేటు బయటే ఉంచి వెళ్లాలని పోలీసులు అభ్యర్థులకు చెప్పారు.
Half Day Schools: ఏపీలో రేపటి నుంచి ఒంటి పూట బడి
పరీక్ష సమయం కంటే ఆలస్యంగా చేరుకున్న వారిని అనుమతించకపోవడంతో వారంతా వెనుదిరగాల్సి వచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, అలాగే కీ... సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. పరీక్ష ముగిసిన వెంటనే ప్రశ్నపత్రాన్ని చూసుకోవచ్చు.
అలాగే సబ్జెక్ట్ నిపుణులతో తయారుచేయించిన కీని కూడా మీరు చూసుకోవచ్చు. సాక్షి ఎడ్యుకేషన్ ఇచ్చే కీ అభ్యర్థుల ప్రాథమిక అవగాహన కోసమే అని గుర్తుంచుకోగలరు. అంతిమంగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే కీని మాత్రమే అభ్యర్థులు అధికారికంగా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది.