1 Lakh for BCs in Telangana: కుల, చేతివృత్తిదారులకు లక్ష ఆర్థిక సాయం... ఇలా అప్లై చేసుకోండి... ఎవరు అర్హులంటే
గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
చదవండి: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఓకే... సీపీఎస్ స్థానంలో నూతన పెన్షన్
ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈనెల 20 వరకు https://tsobmmsbc.cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వీటిని ఆయా జిల్లాల యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 9న మంచిర్యాలలో ప్రారంభించనున్నారు.
చదవండి: డిప్లొమా, డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు... రాత పరీక్ష లేకుండానే నియామకం...
ఇవీ విధి విధానాలు
☛ వెనుకబడిన కులాలు, చేతివృత్తులకు చెందిన వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి వీలుగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
☛ ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
☛ 2023 జూన్ 2 నాటికి 18-55 ఏళ్ల మధ్య వయస్కులు మాత్రమే అర్హులు.
☛ లబ్ధిదారుడి వార్షిక ఆదాయం గరిష్ఠంగా గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూడదు.
చదవండి: ఎలాంటి పరీక్ష లేదు... జస్ట్ పదో తరగతి మార్కులతోనే రైల్వేలో ఖాళీల భర్తీ
☛ గత అయిదేళ్లలో ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రూ.50 వేలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే పొందిన లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
☛ ఈనెల 6 నుంచి 20 తేదీ వరకు https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
☛ మండల స్థాయిల్లో ఎంపీడీఓలు, పురపాలికల్లో మున్సిపల్ కమిషనర్లు ఈనెల 20 నుంచి 26 వరకు దరఖాస్తులను పరిశీలించాలి.
☛ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ జిల్లాస్థాయిలో ఎంపిక పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన అనుమతులను ఈనెల 27 నుంచి జులై 4 వరకు సంబంధిత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల ద్వారా పొందాలి.
చదవండి: ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉన్నాయా... ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి
☛ లబ్ధిదారులను దశల వారీగా ఎంపిక చేసి, ఆ సమాచారాన్ని గ్రామాలు, మండలాల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
☛ ఎంపికైన లబ్ధిదారులకు ప్రతినెలా 15న ఏక మొత్తంలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు.
☛ ఏ వస్తువులు, పరికరాలు కొనాలనేది లబ్ధిదారుల ఇష్టమే.
Chinas Astronauts: మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమమిని పంపిన చైనా
☛ ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు నెల రోజుల్లోపు తమ వృత్తిని ప్రారంభించాలి. అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి. లబ్ధిదారుడు ప్రారంభించిన వృత్తికి సంబంధించిన ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.