Danger Apps: ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉన్నాయా... ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి
తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు.
చదవండి: యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులివే.. విజన్ ప్రో, మాక్‌బుక్, ఐఓఎస్ 17 ఇంకా..
గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే.
రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి, డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించారు.
Chinas Astronauts: మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమమిని పంపిన చైనా
ప్రభావితమైన యాప్‌లు ఇవే
నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్
జాప్యా: ఫైల్ బదిలీ, షేర్
వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్
ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్
బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్
Satya Nadella: కృత్తిమ మేధతో కొత్త ఉద్యోగాల కల్పన... అలాగే భారీగా జీతాలు
క్రేజీ డ్రాప్
క్యాష్‌జైన్ – క్యాష్ రివార్డ్
ఫిజ్జో నావల్ – ఆఫ్‌లైన్ రీడింగ్
క్యాష్ ఈఎం: రివార్డ్స్
టిక్: వాట్ టు ఎర్న్
మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి
♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్‌వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి.
♦ నకిలీ ఆఫర్‌లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్‌ల విశ్వసనీయతను గమనించాలి.
WhatsApp: వాట్సాప్‌లో ఎడిట్ ఫీచర్ ప్రారంభం
♦ ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్‌ను ఇన్‌స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్‌లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే.
♦ యాప్ డెవలపర్‌ని ఇతర సోషల్‌మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి.
♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి.
♦ పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు.
ముఖ్యంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్‌స్టాల్ చేయకపోవడమే మంచిది.