Skip to main content

Malware Attacks: మ‌న దేశానికి మాల్‌వేర్‌ ముప్పు.. సైబర్‌సెక్యూరిటీ సంస్థ నివేదికలో కీలక విషయాలు వెల్ల‌డి!

ఇత‌ర‌ దేశాలతో పోలిస్తే భారత‌దేశానికి మాల్‌వేర్‌పరమైన ముప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022లో ఇవి ఏకంగా 31 శాతం ఎగిశాయి.
Malware Attacks

అలాగే రాన్‌సమ్‌వేర్‌ దాడులు 53 శాతం పెరిగాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ సోనిక్‌వాల్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌ వంటి దేశాల్లో సైబర్‌ నేరగాళ్లు తమ దాడుల పరిధిని మరింతగా పెంచుకుంటున్నారని, కొత్త టార్గెట్లను ఎంచుకోవడం, కొంగొత్త విధానాలు అమలు చేస్తున్నారని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ దేబాశీష్‌ ముఖర్జీ తెలిపారు. వారు అవకాశాల కోసం నిరంతరం అన్వేషిస్తూ, ఒకసారి విజయవంతమైతే మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని వివరించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (07-13 మే 2023)

ఈ నేపథ్యంలో కంపెనీలకు సైబర్‌ నేరగాళ్ల వ్యూహాలను ఆకళింపు చేసుకుని, వారి దాడులను ఎదుర్కొనగలిగే నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సైబర్‌ సెక్యూరిటీ మార్కెట్‌ 2022లో 173.5 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 8.9 శాతం వృద్ధి చెందుతూ 2027 నాటికి 266.2 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనాలు ఉన్నాయి. సోనిక్‌వాల్‌ సర్వీసులు అందించే క్లయింట్లలో 55 శాతం పెద్ద సంస్థలు ఉండగా, 45 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు ఉన్నాయి.

Venice Grand: ఆసక్తికర ఘటన.. రాత్రికి రాత్రే రంగు మారిన కెనాల్ నీరు.. కార‌ణ‌మేమిటంటే..?

Published date : 30 May 2023 04:09PM

Photo Stories