Skip to main content

Apple WWDC 2023: యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులివే.. విజన్​ ప్రో, మాక్​బుక్​, ఐఓఎస్ 17 ఇంకా..

2023 జూన్ 5 నుంచి ప్రారంభమైన 'డబ్ల్యూడబ్ల్యూడీసీ' (వరల్డ్​వైడ్​ డెవలపర్స్​ కాన్ఫరెన్స్​) మొదటి రోజే యాపిల్ సంస్థ విజన్​ ప్రో, కొత్త మాక్​ బుక్స్​, లేటెస్ట్​ ఓఎస్​ అప్​గ్రేడ్స్​ వంటి వాటిని లాంచ్ చేసింది.
Apple’s top six announcements at WWDC 2023

కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

విజన్​ ప్రో..
యాపిల్ కంపెనీ డబ్ల్యూడబ్ల్యూడీసీలో విడుదల చేసిన విజన్​ ప్రో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్శించింది. సంస్థ చరిత్రలోనే మిక్స్​డ్​ రియాలిటీ హెడ్​సెట్​. దీనిని గ్లాస్ఎం కార్బన్ ఫైబర్, అల్యూమినియం మిశ్రమాలతో తయారు చేసారు. దీని ధర 3,499 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.88 లక్షలు. ఈ విజన్​ ప్రో కర్వడ్​ ఫ్రేమ్​, ఫ్రెంట్​ గ్లాస్​, థర్మల్​ వెంట్స్​, ఎడమవైపు పుష్​ బటన్స్ వంటి వాటిని పొందుతుంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (07-13 మే 2023)

అంతే కాకుండా ఇందులో డ్యూయెల్​ 1.41 ఇంచెస్​ 4కే మైక్రో ఓఎల్​ఈడీ, 23 మిలియన్​ కంబైన్డ్​ పిక్సెల్స్​, 12 కెమెరాలు ఉన్నాయి. అయితే ఇందులో ఎలాంటి కంట్రోలర్స్​, హార్డ్​వేర్​ లేవు కానీ కెమెరాలతో కళ్లు ట్రాక్​ అయ్యి యాప్​ ఓపెన్ అవుతుంది. విజన్​ ప్రోలో ఎమ్2 చిప్​, ఆర్​1 కోప్రాసెసర్​, 16జీబీ ర్యామ్​ వంటివి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఆడియో​ డ్రైవర్స్​, 6 మైక్రోఫోన్స్​, 6 సెన్సార్స్​, కంపాస్​, యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, యాక్సలరోమీటర్​, గైరోస్కోప్​ వంటి సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్​, సిరి, టైప్​-సీ ఛార్జర్​ వంటివి కనెక్టెడ్​ ఫీచర్స్​ లభిస్తాయి. 

Chinas Astronauts: మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమమిని పంపిన చైనా

15 ఇంచెస్ మాక్​బుక్​ ఎయిర్..
డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో కంపెనీ '15 ఇంచెస్ మాక్​బుక్​ ఎయిర్'ని​ విడుదల చేసింది. ఇది థండర్​బోల్ట్​ పోర్ట్స్​, మాగ్​సేఫ్​ ఛార్జింగ్​ పోర్ట్​ వంటి వాటిని పొందుతుంది. ఇది నాలుగు కలర్ ఆప్షన్స్‌లో వచ్చే వారం నుంచి అందుబటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులోని బ్యాటరీ ప్యాకప్ వ్యవధి సుమారు 18 గంటల వరకు ఉంటుంది.

అప్డేటెడ్ మాక్​ స్టూడియో..
యాపిల్ సంస్థ 2023 డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో ఎం2 మ్యాక్స్​, ఎం2 అల్ట్రా చిప్​సెట్స్​ వంటి వాటిని రిలీవ్ చేసింది. ఇప్పటికే మాక్​బుక్​ ప్రో మోడల్స్​లో ఎం2 మ్యాక్స్ అందుబాటులో ఉంది. కొత్త మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వేంగంగా పనిచేస్తుండనై కంపెనీ వెల్లడించింది. మాక్​ స్టూడియో ప్రారంభ ధర భారతదేశంలో రూ. 2.99 లక్షలు కాగా, మ్యాక్ ప్రో ధర రూ. 7.29 లక్షలు.

ఐఓఎస్ 17..
సంస్థ మెసేజెస్, ఫేస్​టైమ్​ యాప్స్​ కోసం ఐఓఎస్​ 17 లాంచ్ చేసింది. కావున ఇప్పుడు టైపోగ్రఫీతో కస్టమైజ్​డ్​ పోస్టర్లను తయారు చేసుకోవచ్చు. ఆటో- కరెక్ట్​, డిక్టేషన్​ వంటి ఫీచర్స్​ మరింత మెరుగుపడ్డాయి. ఐఓఎస్​ 17లో జర్నల్​ అనే కొత్త యాప్​ వస్తోంది. ఇందులో యూజర్లు తమకు నచ్చినవి రాసుకోవచ్చు. 2023 డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో ఐపాడ్ఓఎస్17, మ్యాక్ఓఎస్ సోనోమా, వాచ్ఓఎస్ 10, టీవీఓఎస్ 17 వంటి వాటిని కూడా సంస్థ పరిచయం చేసింది.

Satya Nadella: కృత్తిమ మేధతో కొత్త ఉద్యోగాల క‌ల్ప‌న‌... అలాగే భారీగా జీతాలు

Published date : 06 Jun 2023 05:52PM

Photo Stories