Skip to main content

Telangana రైతులకి డ్రోన్లు

Drones for Telangana farmers
Drones for Telangana farmers

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్‌ టిల్లర్లు తదితరాలు సబ్సిడీపై అందజేస్తోంది. దీంతో ఇప్పటికే ట్రాక్టర్ల వినియోగం పెరిగిపోయింది. రైతులు పురాతన, సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయా యంత్రాలను, పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీనికి మరింత ఊతం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

పిచికారీ కష్టాలకు చెక్‌ 
ప్రస్తుతం డ్రోన్లను ఫొటోలు తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వ్యవసాయానికి వాడే డ్రోన్లు రైతుకు అనేక రకాలుగా ఉపయోగపడేలా చూస్తారు. ప్రధానంగా పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. డ్రోన్‌ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. డ్రోన్‌ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.  
కొన్ని పంటలకు మొక్కల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదల్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు అదనపు పరికరాలు సమకూరుస్తారు. ఒక్కో డ్రోన్‌ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. వాటిని రైతులకు సబ్సిడీపై ఇస్తారు. అయితే చాలావరకు ఒక్కో రైతుకు ఒక్కో డ్రోన్‌ అవసరం ఉండదు. పైగా ధర ఎక్కువ. ఈ నేపథ్యంలో కొంతమంది రైతుల బృందానికి ఒక  డ్రోన్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 16th కరెంట్‌ అఫైర్స్‌

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 20 Jul 2022 05:03PM

Photo Stories