Skip to main content

Ayushman Bharat: ఏబీడీఎం అమలులో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం

Telugu Current Affairs - Re: ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మే 20న నేషనల్‌ హెల్త్‌ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) సీఈవో డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ తెలిపారు. పౌరుల ఆరోగ్య వివరాలకు సంబంధించి ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ, వైద్య పరీక్షలు, చికిత్స లాంటి సమస్త వివరాలను కాగితాలతో పనిలేకుండా కేవలం ఒక్క క్లిక్‌ ద్వారా తెలుసుకునేలా ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యాధునిక క్యాన్సర్‌ ఆసుపత్రిను నిర్మించారు?

14 అంకెలతో డిజిటల్‌ ఐడీ
దేశంలో ఎక్కడికి వెళ్లినా కాగితాలతో పనిలేకుండా పౌరులకు వైద్య సేవలు అందించడం ఏబీడీఎం ముఖ్య ఉద్దేశం. ప్రతి పౌరుడికీ 14 అంకెల డిజిటల్‌ ఆరోగ్య ఐడీ నంబర్‌ కేటాయించి కాగితాల అవసరం లేకుండా ఈ–హాస్పిటల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 2.75 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రంలో డిజిటల్‌ ఐడీలు జారీ అయ్యాయి.

GK Economy Quiz: భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్నది?

ఏబీడీఎం అమలు ఇలా..

రాష్ట్రం

పౌరులకు ఐడీల జారీ కోట్లలో

ఏపీ

2.75

బిహార్

1.48

మహారాష్ట్ర

1.42

కేరళ

1.28

ఉత్తరప్రదేశ్

1.27

అత్యవసర సమయంలో ప్రజల ఉపయోగించేందుకు "కవల్ ఉతావి" యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?

ఆసుపత్రుల రిజిస్ట్రేషన్

ఉత్తరప్రదేశ్

26,824

ఏపీ

13,373

పశ్చిమబెంగాల్

10,022

మహారాష్ట్ర

5,022

మధ్యప్రదేశ్

2,317

జమ్మూకశ్మీర్

1,175

 

వైద్యుల రిజిస్ట్రేషన్

ఏపీ

7,023

చండీగఢ్

1,692

పుదుచ్చేరి

1,309

మహారాష్ట్ర

842

జమ్మూకశ్మీర్

839

 Grid Dynamics: దేశంలో గ్రిడ్‌ డైనమిక్స్‌ మొదటి యూనిట్‌ ఎక్కడ ఏర్పాటు కానుంది?

​​​​​​​​​​​​​​దేశంలోనే తొలిసారిగా..
ఏబీడీఎం కార్యక్రమాల్లో రాష్ట్రం ముందు వరుసలో నిలవడంతో నర్సింగ్, పారామెడికల్‌ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏబీడీఎంలో నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది.
Integrated Renewable Energy Project: ప్రపచంలో తొలి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) కార్యక్రమాల అమలులో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు  : మే 20
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎక్కడ    : దేశంలో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 May 2022 04:40PM

Photo Stories