Skip to main content

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యాధునిక క్యాన్సర్‌ ఆసుపత్రిను నిర్మించారు?

SVICCAR

అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో తిరుపతిలో నిర్మించిన ‘‘శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌(SVICCAR)’’ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక కార్పొరేట్‌ వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్‌ కేర్‌కు చిరునామాగా నిలిచే ఈ ఆసుపత్రిని రూ.190 కోట్ల వ్యయంతో 92 పడకలతో నిర్మించారు. దశలవారీగా పడకలను 300కు పెంచనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 5వ తేదిన ఈ అత్యాధునిక క్యాన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి టాటా సంస్థకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాయి. టాటా ట్రస్టు చైర్మన్‌గా రతన్‌టాటా, అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌కు సీఈగా సంజయ్‌చోప్రా వ్యవహరిస్తున్నారు.

GK Sports Quiz: వ్లాదిమిర్ పుతిన్‌ను గౌరవ అధ్యక్షుడిగా సస్పెండ్ చేసిన క్రీడా సమాఖ్య? Health Cloud: తొలి ఇంటిగ్రేటెడ్‌ వైద్య పరికరాల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటైంది?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :
శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌(SVICCAR) ఆసుపత్రి నిర్మాణం
ఎప్పుడు : మే 03
ఎవరు    : టాటా ట్రస్టు, అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌
ఎక్కడ    : తిరుపతి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు  : ప్రజలకు అత్యాధునిక కార్పొరేట్‌ వైద్య సేవలు అందించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 May 2022 06:06PM

Photo Stories