Grid Dynamics: దేశంలో గ్రిడ్ డైనమిక్స్ మొదటి యూనిట్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
![Grid Dynamics](/sites/default/files/images/2022/05/10/grid-dynamics-1652191475.jpg)
అమెరికా కేంద్రంగా డిజిటల్ సమస్యల పరిష్కారంలో పేరొందిన అంతర్జాతీయ కంపెనీ ‘గ్రిడ్ డైనమిక్స్’భారత్‌లో తన మొదటి యూనిట్‌ను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని మే 9న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. ఈ యూనిట్‌తో ఏడాదిలోపు వేయి మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు. సంస్థ సీఈఓ లివ్‌షిట్జ్ నేతృత్వంలో గ్రిడ్ డైనమిక్స్ ప్రతినిధి బృందం మే 9న ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమావేశమై.. యూనిట్ ఏర్పాటు విషయమై చర్చలు జరిపింది.
హైసియా ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్‌గా ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెజ్ సెంటర్ హెడ్ సెంటర్ హెడ్ మనీషా సాబూ ఎన్నికయ్యారు. ఒక మహిళ ఈ బాధ్యతలు చేపట్టడం హైసియా చరిత్రలో ఇదే తొలిసారి. 2022–24 కాలానికి ఆమె ఈ పదవిలో ఉంటారు. హైసియా సీఎస్‌ఆర్ విభాగానికి మనీషా నేతృత్వం వహిస్తున్నారు. ఐటీ రంగంలో ఆమెకు 20 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హైసియా వైస్ ప్రెసిడెంట్‌గా ఫస్ట్‌సోర్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్ నందెళ్ల, జనరల్ సెక్రటరీగా ఆరోప్రో సాఫ్ట్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ రామకృష్ణ లింగిరెడ్డి ఎన్నికయ్యారు.
Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రిను నిర్మించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో గ్రిడ్ డైనమిక్స్ మొదటి యూనిట్ తెలంగాణలో ఏర్పాటు కానుంది
ఎప్పుడు : మే 09
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : డిజిటల్ సమస్యల పరిష్కారంలో సేవలందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్