Skip to main content

AP Assembly Budget Session: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోని ముఖ్యాంశాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తున్నారు.
AP Assembly Budget Session

ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అన్నారు. తొలిసారి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని, నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని, వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు.

► రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
► ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్‌
► ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు
► జడ్పీ ఛైర్మన్‌ పోస్టుల్లో 70 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం.
► 137 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం.
► 15.14  లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగజ్జీవన్‌ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
► ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్‌
► వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది.
► స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజలో ఉంది
► గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు
► గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉంది
► మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది
► పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది.
► వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్‌ కార్డులు
► పీహెచ్‌సీలలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు
► వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు
► ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్‌ పింఛన్‌ కానుక
► వాలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ
► 2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు
► మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
► నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం
► 81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ
► జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ. 927,49 కోట్లు
► వైఎస్సార్‌ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ చేశాం
► విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్‌ లెర్నింగ్‌
► విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ
► జగనన్న విద్యా​కానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు
► 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు
► 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు రీడిజైన్‌
► జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి
► జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ.3,239 కోట్లు ఖర్చు
► ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
► రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు
► కూరుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశాం
► కడపలో డా.వైఎస్సార్‌ ఆర్కిటైక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్ వర్శిటీ
► అమ్మ ఒడి  ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం
► 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థిక సాయం
► అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు.
► కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు.
► వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం.
► 11.43 శాతం గ్రోత్‌ రేటును సాధించాం.
► ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది.
► మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు.

తెలుసుకోండి: Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2023–24

తెలుసుకోండి: Telangana Budget 2023‌-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023‌-24

Published date : 14 Mar 2023 11:51AM

Photo Stories