AP Budget Sessions: 24వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు... 16న బడ్జెట్
రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందని చెప్పారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకే సొమ్ము అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడుతో పాఠశాలల ఆధునీకరణ చేపట్టిందన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల మంది తల్లులకు రూ.15వేలు చొప్పున రూ.9900 కోట్లు అందించినట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన అందిస్తున్నట్లు గవర్నర్ వివరించారు.
ఈ నెల 16న బడ్జెట్....
స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ నెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని ముఖ్యాంశాలు