AP Budget Sessions:ఏపీలో నాలుగేళ్లుగా అవినీతిలేని సుపరిపాలన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిసారి గవర్నర్ ప్రసంగించారు.
అవినీతికి తావులేకుండా....
తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని గవర్నర్ తెలిపారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు.
విద్యా సంస్కరణలు
అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం. 44.49 లక్షల మంది తల్లులకు రూ.19, 617.60 కోట్లు ఆర్థిక సాయం. విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్. విద్యార్థులకు రూ. 690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ. జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల రీడిజైన్ చేశామని గవర్నర్ తెలిపారు.
చదవండి: 24వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు... 16న బడ్జెట్
మండలంలో కనీసం 2 జూ.కళాశాలలు
ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైన రాష్ట్రం ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం 2 జూనియర్ కళాశాలల ఏర్పాటు. జగనన్న గోరుముద్దతో ఇప్పటి వరకు. రూ.3,239 కోట్లు ఖర్చుతో 43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్. జగనన్న విద్యాదీవెన కింద 24.75 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 9,249 కోట్లు చెల్లించాం. హాస్టల్, మెస్ ఛార్జీల కోసం..రూ. 20 వేలు చెల్లిస్తున్నాం. ఈ పథకం కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు 3,366 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు.
చదవండి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని ముఖ్యాంశాలు
ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ
కడపలో డా. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు. కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం. విజయనగరంలో జేఎన్టీయూ-గురజాడ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. కర్నూలులో కస్టర్ యూనివర్సిటీ. ఉన్నత విద్య కోసం 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు. వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు. పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.