Supreme Court: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు
Rajiv Gandhi Assassination Case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పెరారివాలన్‌ను విడుదల చేయాలంటూ మే 18న ఆదేశాలు జారీ చేసింది. పెరారివాలన్ విడుదల తమిళనాడు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం పేరరివాళన్‌ను విడుదల చేయడం సమంజసమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేరరివాళన్ విడుదలతో ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమమైనట్లైంది.
కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య కేసులో పేరరివాళన్‌తో పాటు దోషులుగా తేలిన మురుగన్, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలనే గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవల పేరరివాళన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసుని విచారించిన ధర్మాసనం రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివాలన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
GK Important Dates Quiz: అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం?
PM Modi: బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ ఏ దేశంలో పర్యటించారు?
GK National Quiz: 2021-22లో భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్