కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 02-08 April, 2022)
![GK Quiz Science & Technology Practice Test 02-08 April, 2022)](/sites/default/files/images/2022/05/06/thirdhottestplacescinceandtechnology-1651829057.jpg)
1. ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ 'లివింగ్ రూట్ బ్రిడ్జ్' కల్చరల్ ల్యాండ్‌స్కేప్‌లను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చారు?
ఎ. సిక్కిం
బి. మేఘాలయ
సి. కర్ణాటక
డి. జమ్ము & కశ్మీర్
- View Answer
- Answer: బి
2. మెస్ ఐనాక్లోని పురాతన బుద్ధ విగ్రహాలను పరిరక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించిన 'మెస్ ఐనాక్ సైట్' , 'బుద్ధాస్ ఆఫ్ బమియాన్' ఎక్కడ ఉన్నాయి?
ఎ. భారత్
బి. నేపాల్
సి. చైనా
డి. అఫ్గనిస్తాన్
- View Answer
- Answer: డి
3. భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడానికి, 105వ దేశంగా అవతరించడానికి ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన దేశం?
ఎ. బంగ్లాదేశ్
బి. నేపాల్
సి. పాకిస్తాన్
డి. శ్రీలంక
- View Answer
- Answer: బి
4. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ నుండి ఏ భారతీయ స్పేస్-టెక్ స్టార్టప్ తన మొదటి వాణిజ్య ఉపగ్రహం `శకుంతల'ను ప్రయోగించింది?
ఎ. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్
బి. టీంఇండస్
సి. ధృవ స్పేస్
డి. Pixxel
- View Answer
- Answer: డి
5. రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలతో నిఘాలో ఉండే భారతీయ నగరం?
ఎ. న్యూఢిల్లీ
బి. కోజికోడ్
సి. ముంబై
డి. చెన్నై
- View Answer
- Answer: బి
6. ఎల్ డొరాడో వాతావరణ వెబ్సైట్ ప్రకారం ప్రపంచంలోని మూడవ అత్యంత వేడి ప్రదేశంగా నమోదైన భారతీయ రాష్ట్రం ?
ఎ. జైసల్మేర్ జిల్లా, రాజస్థాన్
బి. ధార్వాడ్ జిల్లా, కర్ణాటక
సి. నాగపాటినం జిల్లా, తమిళనాడు
డి. చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
7. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మస్కట్ పేరు?
ఎ. వికల్ప్
బి. కవచ్
సి. ప్రకృతి
డి. పరివేష్
- View Answer
- Answer: సి
8. వన్యప్రాణులకు చట్టబద్ధమైన హక్కులను కల్పించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం?
ఎ. ఈక్వెడార్
బి. ఎల్ సాల్వడార్
సి. జర్మనీ
డి. ఇటలీ
- View Answer
- Answer: ఎ
9. కొత్త కోవిడ్ వేరియంట్ XE - భారతదేశపు మొదటి కేసు ఏ నగరం నమోదైంది?
ఎ. ముంబై
బి. కొచ్చి
సి. ఢిల్లీ
డి. బెంగళూరు
- View Answer
- Answer: ఎ
10. హైడ్రోజన్‌ను మండించడం ద్వారా 'గ్రీన్' స్టీల్‌ను ఉత్పత్తి చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన దేశం?
ఎ. ఇటలీ
బి. స్వీడన్
సి. ఆస్ట్రేలియా
డి. పోలాండ్
- View Answer
- Answer: బి
11. పుదుచ్చేరిలో సీ లెవల్ ట్రయల్స్‌ని విజయవంతంగా పూర్తి చేసిన ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్?
ఎ. DANSA-NG
బి. EANSA-NG
సి. HANSA-NG
డి. GANSA-NG
- View Answer
- Answer: సి