Vote Of Confidence: పార్లమెంట్ విశ్వాసం పొందిన ప్రచండ
Sakshi Education
నేపాల్ నూతన ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’(68) జనవరి 10న పార్లమెంట్ విశ్వాస తీర్మానం నెగ్గారు.
ఎన్నికల ముందు నేపాలీ కాంగ్రెస్‌తో పెట్టుకున్న పొత్తును వదిలేసి, అనూహ్యంగా ప్రతిపక్ష నేత కేపీ ఓలీతో చేతులు కలిపిన ప్రచండ మూడోసారి నేపాల్ ప్రధానిగా డిసెంబర్ 26న బాధ్యతలు చేపట్టారు. ప్రతినిధుల సభలోని 275 మందికి గాను 138 మంది ఓట్లు అవసరం కాగా, ప్రచండకు రికార్డు స్థాయిలో 268 మంది అనుకూలంగా ఓటేశారు. ప్రచండ సభ విశ్వాసం పొందినట్లు సభాధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నేత పశుపతి షంషేర్ రాణా ప్రకటించారు.
US House Speaker: ప్రతినిధుల సభ స్పీకర్‌గా మెక్‌కార్తీ
Published date : 11 Jan 2023 01:48PM