US House Speaker: ప్రతినిధుల సభ స్పీకర్‌గా మెక్‌కార్తీ
అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన 82 ఏళ్ల నాన్సీ పెలోసీ స్థానంలో ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 2022లో జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ 222 స్థానాలు గెలుచుకోగా డెమొక్రటిక్ పార్టీ 212 సీట్లకు పరిమితమై మెజారిటీ కోల్పోవడం తెలిసిందే.
ఐదో సుదీర్ఘ పోటీ
తాజా ఎన్నిక అమెరికా చరిత్రలో ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నికకు జరిగిన ఐదో సుదీర్ఘ పోటీగా నిలిచింది. 1855లో జరిగిన ఎన్నిక ఏకంగా రెండు నెలల పాటు ఏకంగా 133 రౌండ్లు కొనసాగి చరిత్ర సృష్టించింది!
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
చరిత్ర సృష్టించిన హకీం
ప్రతినిధుల సభలో అధికార డెమొక్రటిక్ పార్టీ నేతగా హకీం సెకూ జెఫ్రీస్ వ్యవహరించనున్నారు. ప్రతినిధుల సభలో ఒక పార్టీకి సారథ్యం వహిస్తున్న తొలి నల్ల జాతీయునిగా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు సారథులుగా వహించిన వారిలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించిన తొలి నేత కూడా ఆయనే. మెక్‌కార్తీని స్పీకర్‌గా ఎన్నుకోవడానికి రిపబ్లికన్లు 15 రౌండ్ల పాటు ఆపసోపాలు పడగా హకీంకు మాత్రం ప్రతి రౌండ్‌లోనూ డెమొక్రాట్ల 212 ఓట్లూ గంపగుత్తగా పడ్డాయి. ‘‘అన్ని రంగులు, ఖండాలు, మతాల వారికీ.. సామ్యవాదుల నుంచి స్వలింగ సంపర్కులు దాకా అందరికీ అమెరికా నెలవు. మేమంతా ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం’’ అంటూ ఈ సందర్భంగా హకీం భావోద్వేగంతో మాట్లాడారు.