North Korea: క్షిపణి ప్రయోగంతో కొత్త ఏడాదికి స్వాగతం..
Sakshi Education
ప్రపంచ దేశాలన్నీ బాణసంచా వెలుగులతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడితే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం క్షిపణి ప్రయోగంతో స్వాగతం పలికారు.
డిసెంబర్ 31న ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం నిర్వహించింది. అది 400 కిలోమీటర్లు ప్రయాణించి, కొరియా ద్వీపకల్పం–జపాన్ మధ్య సముద్ర జలాల్లో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వ్రస్తాలను కలిగి ఉండాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
అగ్రరాజ్యం అమెరికాను కిమ్ శత్రుదేశంగా పరిగణిస్తున్నారు. ఆయుధ శక్తితో అమెరికాకు బుద్ధి చెప్పడమే తమ లక్ష్యమని తరచుగా చెబుతున్నారు. ఉత్తర కొరియా సైన్యం గత ఏడాది 70కి పైగా క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఇందులో 3 షార్ట్–రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను దక్షిణ కొరియా గుర్తించింది. త్వరలో తొలి నిఘా ఉపగ్రహం(శాటిలైట్) ప్రయోగానికి కిమ్ సైన్యం సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Published date : 02 Jan 2023 12:51PM