Prachanda: నేపాల్ ప్రధానిగా ప్రచండ
Sakshi Education
నేపాల్‌లో నెల రోజుల రాజకీయ అస్థిరతకు ఆదివారం తెర పడింది. మాజీ గెరిల్లా నాయకుడు, సీపీఎన్–మావోయిస్టు సెంటర్ చైర్మన్ పుష్పకమల్ దహల్ ప్రచండ (68) కొత్త ప్రధానిగా నియమితులయ్యారు.
ఆయన డిసెంబర్ 26న ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య నేపాలీ కాంగ్రెస్ సారథ్యంలోని ఐదు పార్టీల కూటమి నుంచి వైదొలిగిన ప్రచండ సీపీఎన్–యూఎంఎల్ తదితర పక్షాలతో జట్టు కట్టారు. 275 మంది ఎంపీలున్న పార్లమెంటులో ఆయన సారథ్యంలోని సంకీర్ణానికి 168 మంది మద్దతు సమకూరింది. ప్రధాని బాధ్యతలు చేపట్టడం ప్రచండకు ఇది మూడోసారి. ఆయనకు చైనా అనుకూలునిగా, భారత వ్యతిరేకిగా పేరుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Published date : 26 Dec 2022 05:02PM