Skip to main content

Ram Chandra Poudel: నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్‌!

నేపాల్‌ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రామచంద్ర పౌద్యాల్‌ ఎన్నికయ్యే అవకాశముంది.
Ram Chandra Poudel

దేశాధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 27న ఆయన అభ్యర్థిత్వానికి ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్‌(యూఎంఎల్‌), పుష్పకమల్‌ దహాల్‌(ప్రచండ) నేతృత్వంలోని సీపీఎన్‌(మావోయిస్ట్‌ సెంటర్‌), మరో ఐదు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే కూటమి పార్టీ అయిన సీపీఎన్‌(యూఎంఎల్‌) బలపరిచిన అభ్యర్థి సుభాష్‌ నెబాంగ్‌కి కాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థికి ప్రధానమంత్రి ప్రపంచ మద్దతు పలకడంతో రెండు నెలల క్రితమే కొలువుదీరిన ప్రభుత్వం కూలే పరిస్థితులు నెలకొన్నాయి.
నేపాల్‌ పార్లమెంట్‌లో పార్టీల ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ ఎనిమిది పార్టీలు బలపరిచే అభ్యర్థే వచ్చే నెలలో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. ప్రచండ నిర్ణయంతో ఆగ్రహించిన అధికార కూటమిలోని నేషనల్‌ డెమొక్రటిక్‌ పార్టీ తాము ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్‌ రాజేంద్ర ప్రసాద్‌ లింగ్డెన్‌ ఉపప్రధానిగా రాజీనామా చేశారు. కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే నెలరోజుల్లోపు పార్లమెంట్‌లో ప్రచండ విశ్వాస పరీక్షలో నెగ్గాలి.

Ajay Banga: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా.. ఈయ‌న చ‌దివింది మ‌న హైద‌రాబాద్‌లోనే..!

Published date : 27 Feb 2023 03:15PM

Photo Stories