Ajay Banga: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా.. ఈయన చదివింది మన హైదరాబాద్‌లోనే..!
ప్రస్తుత వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు డేవిస్ మాల్పాస్ ఈ ఏడాది చివర్లో పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో బైడెన్ అజయ్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్‌ను సమర్థంగా ముందుకు నడిపించగల సత్తా అజయ్ బంగాకు ఉందని ప్రశంసించారు. ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదిస్తే అత్యంత ప్రతిష్టాత్మక పదవికి అజయ్ బంగా ఎంపికవుతారు. అదే జరిగితే ఆయన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారత్–అమెరికన్‌గా, తొలి సిక్కు–అమెరికన్‌గా రికార్డుకెక్కుతారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (22-28 జనవరి 2023)
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో..
అజయ్ బంగా హైదరాబాద్, బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఐఐఎం ఢిల్లీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2009లో అజయ్ మాస్టర్ కార్డు సీఈఓగా పనిచేశారు. అంతకుముందు సిటీ గ్రూప్ సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ వ్యవహారాలు చూసేవారు. ప్రస్తుతం అజయ్ జనరల్ అట్లాంటిక్ వైస్–చైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో మాస్టర్‌కార్డ్ అధ్యక్షుడు, సీఈఓగా సేవలందించారు. 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో ప్రఖ్యాత పురస్కారాలు స్వీకరించారు.
Niti Aayog: నీతి ఆయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం