Mohammad Yunus : బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వ సారధిగా యూనస్.. 84 ఏళ్ల వయసులో..
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధాని షేక్‌హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు.
ఈ పరిస్థితుల్లో 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధిగా 84ఏళ్ల యూనస్‌కు 2006లో నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమిస్తూ దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాదు, ఆయన స్వయంగా గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఇలా ఆయన చేసిన కొన్ని సేవా కార్యక్రమాల వల్ల నోబుల్ అవార్డుకు అర్హులయ్యారు. యూనస్ బాద్యతలు చేపట్టిన తరువాత భారత ప్రధాని నరేంద్ర మోది శుభాకాంక్షలు తెలిపారు.