India's first woman Governer ADC: గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ
Sakshi Education
దేశంలో గవర్నర్ ఏడీసీ (ఎయిడ్ ది క్యాంప్)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2015 బ్యాచ్‌కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాఢిని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఉత్తర్వులిచ్చారు. త్రివిధ దళాలకు చెందిన ఒక అధికారిని ఏడీసీగా నియమించుకునే అధికారం దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లకు ఉంటుంది.
Veera Rana: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీర రాణా
‘ఆమె నియామకం ఒక మైలు రాయే కాకుండా.. లింగభేదాలను చెరిపేస్తూ మహిళలు గతంలో ఎన్నడూ అడుగుపెట్టని రంగాల్లో ప్రవేశిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ. మహిళాశక్తికి నిదర్శనం. ఈ అరుదైన సందర్భాన్ని గుర్తుంచుకోవడం తోపాటు ప్రతి రంగంలో మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడానికి ప్రయత్నించాలి’ అని ఈ సందర్భంగా హరిబాబు పిలుపు నిచ్చారు.
Microsoft Global Delivery Centre Leader: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్‌గా అపర్ణ గుప్తా
Published date : 06 Dec 2023 09:56AM