Skip to main content

Imtiaz Qureshi: మాస్ట‌ర్ చెఫ్, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత ఇంతియాజ్ ఖురేషీ క‌న్నుమూత‌

మొగలుల కాలంనాటి దమ్‌ పుఖ్త్‌ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ పాకశాస్త్ర దిగ్గజం మాస్ట‌ర్ చెఫ్ ఇంతియాజ్ ఖురేషి (93) ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ క‌న్నుమూశారు.

లక్నో ప్రాంతంలో మాత్రమే వాడే వంట పాత్ర మూత చివర్ల నుంచి గాలి పోకుండా పిండి ముద్దను చుట్టే (ధమ్‌ ఫుఖ్త్‌) టెక్నిక్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చి ప్రశంసలు అందుకున్నారు. ప్రాచీన అవధ్‌ వంటకాలనూ ఆయన కొత్త తరహాలో సృష్టించారు. 

ఖురేషి 1931లో చెఫ్‌ల కుటుంబంలో పుట్టారు. బుఖారా వంటకాలను కనిపెట్టింది కూడా ఖురేషీనే. 1979లో ఐటీసీ హోటల్స్‌లో చేరి ప్రధాన చెఫ్‌ స్థాయికి ఎదిగారు. ఎందరో దేశ, విదేశీ ప్రముఖులకు తన వంటకాలు రుచు చూపి ఔరా అనిపించారు. ఆహార ప్రియులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అయిన ఖురేషీ వంటలంటే పడిచచ్చే వాళ్ల జాబితా చాలా పెద్దది. ప్రధాని, రాష్ట్రపతి విశిష్ట అతిథుల ప్రత్యేక విందుల్లో ఆయనే స్పెషల్‌ వంటకాలు వండేవారు. 2016లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఈ అవార్డ్‌ అందుకున్న తొలి పాకశాస్త్ర ప్రవీణుడు ఈయ‌నే.

Laxman Bhatt Tailang: ‘పద్మశ్రీ’ అందుకోకుండానే సంగీత విద్వాంసుడు కన్నుమూత!!

Published date : 17 Feb 2024 03:22PM

Photo Stories