Laxman Bhatt Tailang: ‘పద్మశ్రీ’ అందుకోకుండానే సంగీత విద్వాంసుడు కన్నుమూత!!
జనవరి 26వ తేదీన భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి కొద్ది రోజుల ముందు పండిట్ తైలాంగ్ కన్నుమూశారు. నేషనల్ మీడియా కథనాల ప్రకారం పండిట్ తైలాంగ్ న్యుమోనియాతో పాటు ఇతర వ్యాధులతో చికిత్స పొందుతూ జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
జైపూర్‌కు చెందిన పండిట్ లక్ష్మణ్ భట్ తన జీవితమంతా సంగీత సాధనకు అంకితం చేశారు. ఇందులో తన పిల్లలతో పాటు అనేక మంది విద్యార్థులకు విస్తృతమైన జ్ఞానం, విద్యను అందించాడు. ఆయన తన కుమారుడు రవిశంకర్‌తో పాటు కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తిలను వివిధ సంగీత కళా ప్రక్రియలలో ప్రావీణ్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించారు.
Bharat Ratna: ‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులు వీరే..
బనస్థలి విద్యాపీఠ్, రాజస్థాన్ సంగీత సంస్థలో సంగీత ఉపన్యాసకుడిగా ఆయన పనిచేశారు. 1985లో జైపూర్‌లో 'రసమంజరి' పేరుతో ఒక సంగీతోపాసు కేంద్రాన్ని ఆయన స్థాపించారు. అక్కడ ఎందరికో ఉచితంగానే విద్యను అందించారు. 2001లో జైపూర్‌లో 'అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్'ని స్థాపించి చాలామందికి సాయం అందించారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పద్మ అవార్డును అందుకోకుండానే ఆయన మరణించారు.