Skip to main content

Best Food Cities: ఉత్తమ ఆహార జాబితాలో చోటు దక్కించుకున్న 5 భారతదేశ‌ నగరాలు, టాప్ 10 న‌గ‌రాలివే..!

పర్యాటకులు ఏ నగరం వెళ్లినా ముందుగా తెలుసుకునేది ఆహారం గురించే. ఎలాంటి ఆహారం దొరుకుతుందని తెలుసుకుని అప్పుడూ స్టే చేయగలమా లేదా నిర్ణయించుకుంటారు.
Best foods list  5 Indian Cities Named In The Best Food Cities In The World  Taste Atlas rankings

అలా అత్యుత్తమ ఆహారం అందించే నగరాల జాబితా తెలిస్తే పర్యాటకలుకు మరితం ఈజీ అవుతుంది. అలాంటి ఉత్తమ ఆహార నగరాల జాబితా ఒకటి ఇటీవలే విడుదలైంది. దీన్నిఆ నగర సంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్థానిక ఆహారాన్ని రుచిగా అందించే.. గల్లీలోని స్టాల్స్‌ నుంచి ఐకానిక్‌ రెస్టారెంట్‌ల వరకు ఏం ఉన్నాయి, ఆహార ప్రియులు ఇష్టపడే నగరాలు, ఆ రెస్టారెంట్‌లకు ఉన్న రేట్లు తదితరాలను పరిగణలోనికి తీసుకుని మరీ ఈ ఉత్తమ ఆహార నగరాల జాబితాను ఇచ్చారు.

ఈ ఉత్తమ ఆహారాల జాబితాను ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఇటీవలే విడుదల చేసింది. ఆ జాబితాలో ఐదు భారతీయ మహానగరాలు చోటు దక్కించుకున్నాయి. ఆ నగరాలు ఏవి అంటే ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, లక్నో టాప్‌ 100 జాబితాలో స్థానం దక్కించుకోగా, టాప్‌ 50లో ముంబై 35వ స్థానం, హైదరాబాద్‌ 39వ స్థానం నిలాచాయి. ఇక ఢిల్లీ 56వ స్థానానికి, చెన్నై(65), లక్నో(92) స్థానాలను దక్కించుకున్నాయి.

టాప్ 10 న‌గ‌రాలివే..
ఇక ఈ జాబితాలో తాజా పదార్థాలతో రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధిగా రోమ్‌(ఇటలీ) నిలిచింది. బోలోగ్నా, నేపుల్స్‌, రెండు ఇటాలియన్‌ నగరాలు రెండు, మూడు ర్యాంక్‌లు దక్కించుకున్నాయి. కాగా, టాప్‌ 10 జాబితాలో స్థానం దక్కించుకున్న ఇతర నగరాలు వియన్నా(ఆస్ట్రియా), టోక్యో(జపాన్‌), హాంకాంగ్‌(చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ) , బాండుంగ్ (ఇండోనేషియా) తదితరాలు. 

World's Largest Solar Power Project: ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన దుబాయ్

Published date : 23 Dec 2023 08:06AM

Photo Stories