Skip to main content

PM Modi: 56వ డీజీపీల సదస్సును ఏ నగరంలో నిర్వహించారు?

Modi

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీల, కేంద్ర పోలీసు దళాల డీజీల సదస్సు-2021 జరిగింది. నవంబర్ 19న ప్రారంభమైన ఈ సదస్సు నవంబర్ 21న ముగిసింది. సదస్సులో రెండో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొని, ప్రసంగించారు. సదస్సులో మావోయిస్టుల హింస, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదుల ఏరివేత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్‌ నేరాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చలు జరిపారు. డీజీపీల సదస్సుపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతిఏటా సదస్సులో స్వయంగా పాల్గొంటున్నారు.

టాటా స్టీల్‌ ఇండియా బ్లిట్జ్‌ టోర్నీ ఎక్కడ జరిగింది?

పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో ముగిసిన టాటా స్టీల్‌ ఇండియా బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) ఎరిగైసి అర్జున్‌ రన్నరప్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్‌... రన్నరప్‌గా నిలవగా,  ప్రపంచ మాజీ బ్లిట్జ్‌ చాంపియన్‌ లెవాన్‌ అరోనియన్‌ (అర్మేనియా) విజేతగా అవతరించాడు.
 

చ‌దవండి: జేపీసీ ఆమోదం తెలిపిన పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు ప్రధాన ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 56వ డీజీపీల, డీజీల సదస్సు(2021) నిర్వహణ
ఎప్పుడు : నవంబర్‌ 19-21 
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్
ఎందుకు : మావోయిస్టుల హింస, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదుల ఏరివేత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్‌ నేరాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై చర్చలు జరిపేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Nov 2021 06:18PM

Photo Stories