Skip to main content

MLCs: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమేర్‌ అలీఖాన్

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌ల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్‌ గతంలో ప్రభుత్వానికి తిప్పిపంపింది.
Kodandaram and Amer Ali Khan Renominated Again for MLC Berths

దీంతో వారి పేర్లనే మళ్లీ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పోస్టులకు సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

కొన్ని కేబినెట్‌ నిర్ణయాలు ఇవే.. 
➤ కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక, వైద్య, సహకారం అందించాలి. 

➤ షూటర్‌ ఈషా సింగ్, బాక్సర్‌ నిఖత్‌ జరీన్, టీం ఇండియా క్రికెటర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలంతోపాటు నిఖత్‌ జరీన్, సిరాజ్‌కు గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం.  

➤ ఇటీవల విధి నిర్వహణలో మరణించిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీ రాజీవ్‌ రతన్‌ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్‌ కమిషనర్‌గా విధినిర్వహణలో మరణించిన అదనపు డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్‌ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఓకే.  

Telangana Job Calendar: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నేడే జాబ్‌ కేలండర్‌, కేబినెట్‌ కీలక నిర్ణయం

➤ 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.437 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదం.  

➤ ఖాయిలాపడిన నిజాం షుగర్స్‌ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి. మంత్రి శ్రీదర్‌బాబు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ప్రకారం రెండు విడతలుగా ఆర్థిక సాయం చేయాలి. 

➤ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మల్లన్నసాగర్‌ నుంచి 15 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట చెరువుకు తరలించి అక్కడి నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలకు తరలించాలనే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌. 
10 టీఎంసీలను హైదరాబాద్‌ తాగునీటికి, మిగిలిన 5 టీఎంసీలను నగర పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నింపడంతోపాటు మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీళ్లు ఉండేలా వదలాలన్న ప్రతిపాదనకు ఓకే.  

➤ ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై ఆగ‌స్టు 2వ తేదీ శాసనసభలో లఘు చర్చ నిర్వహణకు నిర్ణయం.

SC, ST Sub Classification:ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్‌సిగ్నల్‌.. ప్రతి కులానికి రిజర్వేషన్‌ ఫలం!

Published date : 02 Aug 2024 01:31PM

Photo Stories