Skip to main content

Jawahar Reddy: ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి నియమిస్తున్నట్లు నవంబర్‌ 29వ తేదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌శర్మ నవంబర్‌ 30న పదవీ విరమణ చేయగా అదేరోజు సాయంత్రం సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జహహర్‌రెడ్డి ప్రస్తుతం సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కోవిడ్‌ సమయంలో జవహర్‌రెడ్డి వైద్య, ఆరోగ్య,, కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి కోవిడ్‌ కట్టడిలో కీలకపాత్ర పోషించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా పనిచేశారు. ప్రస్తుతం సీఎం ప్రత్యేక సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డిని నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. 2024 జూన్‌ వరకు జవహర్‌రెడ్డి సరీ్వసులో ఉంటారు.
కాగా డా.సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌తో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యనిర్వహకునిగా (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌) ప్రభుత్వం నియమించింది. అదే రోజు పదవీ విరమణ చేస్తున్న మరో ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ఇదే సమయంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను కూడా సర్కారు బదిలీ చేసింది. 
వివరాలు.. 
☛ ప్రస్తుతం వ్యవసాయ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక సీఎస్‌గా పనిచేస్తున్న పూనం మాలకొండయ్యను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.  
☛ రహదారులు–భవనాలు, రవాణా శాఖ ముఖకార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ను పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు.  
☛ ప్రస్తుతం మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రద్యుమ్నను రహదారులు–భవనాలు, రవాణా శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.   
 

Published date : 30 Nov 2022 11:28AM

Photo Stories