Skip to main content

Anganwadi Centers in AP : భ‌వ‌నాల నిర్మాణంపై ఊసు లేదు.. అంగ‌న్వాడీల‌కు అద్దె ఇళ్లేనా!!

Lack of government response for anganwadi centers construction

భీమవరం: గ‌తంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నాడు–నేడు పథకం ఏర్ప‌ర్చి ప్ర‌తీ పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ అభివృద్ధి చేప‌ట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు రూ.9.72 కోట్లు కేటాయించి 60 భవనాలను మంజూరు చేశారు. భవన నిర్మాణంతో పాటు ఫర్నీచర్‌, కిచెన్‌, హాలు, క్లాస్‌ రూమ్‌, టాయిలెట్‌ తదితర సౌకర్యాలు కల్పించారు. ఒక్కో భవనానికి రూ.16 లక్షలు వెచ్చించారు.

Inter Admissions in Model Schools : ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు వేళాయే.. ద‌ర‌ఖాస్తుల‌కు ముఖ్య‌తేదీలు ఇవే..

గత ప్రభుత్వం కాలంలో దాదాపు 90 శాతం మేర భవనాలు ప్రారంభించగా.. ఆరు భవనాలను వేగంగా పూర్తి చేసి అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగించారు. మిగతా భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వాటిని పూర్తిచేసి అంగన్‌ వాడీ కేంద్రాలకు అప్పగించడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. జిల్లాలో మొత్తం 1,562 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 626 సెంటర్లను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.

అద్దె ఇళ్ల‌లో అంగ‌న్వాడీలు..

జగన్‌ ప్రభుత్వం 90 శాతం భవనాల నిర్మాణం చేపట్టింది. వాటిలో కొన్ని ప్రారంభించగా.. కొన్ని నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగతా భవనాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. తమకు ఎందుకన్నట్లు ప్రభుత్వం వ్యహరిస్తోంది. ప్రభుత్వం వచ్చి 10 నెలలవుతున్నా భవనాల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. దాంతో అద్దె ఇళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు నడపాల్సి వస్తోంది. జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శలు చేయడం తప్ప జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించాలనే ఆలోచన లేదు.

17 భ‌వనాలు.. 95 శాతం..

నాడు చంద్రబాబు 10 ఏళ్ల పాలనలో జిల్లాలో అక్కడడక్క అరకొర భవనాలు నిర్మిస్తే.. జగన్‌ తన 5 ఏళ్ల పాలనలో రెండేళ్లు కరోనా వల్ల ఇబ్బంది పడినా.. మూడేళ్లలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణం మొదలుపెట్టారు.

Foreign Education Scholarships: విదేశీ విద్యకు.. స్కాలర్‌షిప్స్ ఇవే!

చంద్రబాబు పాలన వచ్చి 10 నెలలు అవుతున్నా అంగన్‌వాడీలకు కొత్త భవనాలు నిర్మించడం లేదు. పూర్తయిన భవనాలను ప్రారంభించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 6 భవనాలు వినియోగంలోకి వచ్చాయి. 17 భవనాలు 95 శాతం పూర్తయ్యాయి. 13 భవనాలకు శ్లాబ్‌ పూర్తి చేశారు. మరో 5 భవనాలు 100 శాతం పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం పూర్తయినవి ప్రారంభించడం లేదు. వివిధ దశల్లో ఉన్న వాటి నిర్మాణం పూర్తి చేయడం లేదు.

గత ప్రభుత్వంలో అంగన్‌వాడీ భవనాల మంజూరు ఇలా..

మండలం

భవనాల నిర్మాణం

ఆచంట 7
పెనుగొండ 1
పెనుమంట్ర 2
పోడూరు 9
భీమవరం 2
వీరవాసరం 2
మొగల్తూరు 10
నర్సాపురం 2
పాలకొల్లు 4
యలమంచిలి 4
పెంటపాడు 3
తాడేపల్లిగూడెం 2
అత్తిలి 4
ఆకివీడు 1
కాళ్ల 1
పాలకోడేరు 2
గణపవరం 4

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Mar 2025 11:55AM

Photo Stories