Siddharth Sharma : భారత క్రికెట్‌లో విషాదం.. స్టార్ బౌలర్ మృతి
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధార్థ్ తన జట్టుతో కలిసి గుజరాత్‌లో ఉన్నాడు. అయితే కొన్ని రోజుల కిందట అతడు తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో హుటహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన..
కాగా తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ జట్టులో సిద్ధార్థ్ శర్మ భాగంగా ఉన్నాడు. ఇక సిద్ధార్థ్ శర్మ మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా పట్ల సంతాపం వ్యక్తం చేశారు.ఇక శుక్రవారం భాభోర్ సాహెబ్ శ్మశానవాటికలో సిద్ధార్థ్ అంత్యక్రియలు నిర్వహించారు.
చివరిసారిగా..
ఉనాలో జన్మించిన శర్మ.. దేశవాళీ కెరీర్ కొద్ది కాలమే కొనసాగింది. ఐదేళ్లపాటు ఆడిన శర్మ హిమాచల్ ప్రదేశ్‌లో ఒక టీ20 మ్యాచ్, ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, ఆరు లిస్ట్-ఏ గేమ్‌లు ఆడాడు. చివరిసారిగా గత ఏడాది డిసెంబర్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్‌పై ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆడిన 6 మ్యాచ్‌లలో 25 వికెట్లు పడగొట్టాడు.