Jiang Zemin: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
Sakshi Education
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్(96) నవంబర్ 30(బుధవారం) కన్నుమూశారు.
లుకేమియాతో బాధపడుతున్న ఆయన అంతర్గత అవయవాలు పూర్తిగా పనిచేయక పోవడంతో షాంఘైలో తుది శ్వాస విడిచినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆయన మృతిని ప్రకటిస్తూ కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైన్, పార్లమెంట్, మంత్రివర్గం, ఆర్మీ జారీ చేసిన ఓ లేఖను ప్రచురించింది.
1989లో తియానాన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత డెంగ్ షావోపింగ్ నుంచి జియాంగ్ జెమిన్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటికే అంతర్జాతీయంగా చైనా పరపతి దెబ్బతింది. దానిని తిరిగి గాడినపెట్టిన ఘనత జియాంగ్ జెమిన్‌కే చెందుతుంది. హాంకాంగ్‌పై పట్టు సాధించటం, 2008 ఒలింపిక్స్ బిడ్‌ను గెలుచుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామి కావడం వంటి కీలక పరిణామాలు ఆయన హయాంలోనే జరిగాయి.
☛ బెంగాల్ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్
Published date : 30 Nov 2022 04:36PM