CV Ananda Bose : బెంగాల్ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్
Sakshi Education
పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్(71)ను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ నవంబర్ 17న తెలిపింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని ఒక సర్క్యులర్‌లో తెలిపింది.
మణిపూర్ గవర్నర్ గణేశన్ జూలై నుంచి పశ్చిమబెంగాల్‌కు తాత్కాలి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిందే. రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన బోస్ కేరళలోని కొట్టాయంకు చెందినవారు.
Published date : 18 Nov 2022 12:24PM