Skip to main content

Elon Musk: వామ్మో.. నిమిషానికి రూ.5.71 ల‌క్ష‌ల సంపాద‌న‌!!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ గురించి ప్రత్యేక పరిచయం ఎవ‌రికీ అవ‌స‌రం లేదు.
Elon Musk Got Rs.5,71,668.18 With In One Minute

ప్ర‌స్తుతం ఆయ‌న ఓ నిమిషంలో అక్షరాలా రూ.5,71,668.18 సంపాదిస్తున్నారు. ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన వరల్డ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్ కీల‌క‌ వివరాలను వెల్లడించింది. 2023లో మస్క్‌ సంపాదన 3.6203 బిలియన్‌ డాలర్లు (రూ.3,00,55,42,28,745.00). ఆ ఏడాది నిమిషానికి ఆయన రూ.5,71,668 సంపాదించార‌ని తెలిపింద‌ది. గత ఏడాది కన్నా ఆయన నికర సంపద విలువ తగ్గినప్పటికీ ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతున్నారని నివేదిక తెలిపింది. కాగా ఇటీవ‌ల ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు.

Forbes Billionaires 2023: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్.. టాప్‌ 10 కుబేరులు వీరే..

Published date : 16 Feb 2024 10:18AM

Photo Stories