Skip to main content

Forbes Billionaires 2023: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్.. టాప్‌ 10 కుబేరులు వీరే..

ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు.
Richest Person In The World    Top 10 billionaires list

ఎలాన్‌ మస్క్‌ స్థానంలో ఆర్నాల్ట్‌ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్‌ కంపెనీ రియల్‌ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్‌ మస్క్‌ ఆస్తుల విలువ జ‌న‌వ‌రి 26వ తేదీ 204.5 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్‌ డాలర్లు పెరిగి 207.8 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్‌ వివరించింది.

ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ జ‌న‌వ‌రి 25వ తేదీ  ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్‌ ఆస్తిలో 18 మిలియన్‌ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్‌వీఎంహెచ్‌ షేర్ల విలువ జ‌న‌వ‌రి 26వ తేదీ 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్‌ విలువ 388.8 మిలియన్‌ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్‌ తెలిపింది. బెర్నార్డ్‌కు ఎల్‌వీఎంహెచ్‌తోపాటు లూయిస్‌ విట్టన్, ట్యాగ్‌ హ్యుయెర్, డామ్‌ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్‌ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన ఏకైక యూరప్‌ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్‌వీఎంహెచ్‌ గుర్తింపు పొందింది.

Savitri Jindal: అపర కుబేరులను వెన‌క్కునెట్టిన మ‌హిళ‌.. సంపాదనలో అగ్రస్థానం.. ఆమె ఎవ‌రంటే..?

ఫోర్బ్స్‌ ప్రకారం.. టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితా ఇదే..  

1.బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ ‍‌(Bernard Arnault and family) - 207.6 బిలియన్ డాలర్స్ (ఫ్రాన్స్)

2.ఇలాన్ మస్క్ (Elon Musk) - 204.7 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

3.జెఫ్ బెజోస్ (Jeff Bezos) - 181.3 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

4.లారీ ఎల్లిసన్ (Larry Ellison) - 142.2 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

5.మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) - 139.1 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

6.వారెన్ బఫెట్ (Warren Buffett) - 127.2 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

7.లారీ పేజ్‌ (Larry Page) - 127.1 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

8.బిల్ గేట్స్ (Bill Gates) - 122.9 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

9.సెర్గీ బ్రిన్ (Sergey Brin) - 121.7 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

10.స్టీవ్ బాల్మెర్ (Steve Ballmer) - 118,8 బిలియన్ డాలర్స్ (యునైటెడ్‌ స్టేట్స్‌)

Chief Secretary of Assam: అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సిక్కోలు వాసి..

Published date : 30 Jan 2024 07:12PM

Photo Stories