Six High Courts Get New Chief Justices- ఆరు హైకోర్టులకు సీజేల నియామకం
Sakshi Education
న్యూఢిల్లీ: ఆరు హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ రాజస్థాన్ హైకోర్టుకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్న మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను అదే కోర్టులో చీఫ్ జస్టిస్(సీజే)గా నియమించారు.
పంజాబ్, హరియాణా హైకోర్టు యాక్టింగ్ సీజే జస్టిస్ రీతూ బహ్రీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించారు. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్‌ను ఒడిశా హైకోర్టు సీజేగా నియమించారు. రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ను గౌహతీ హైకోర్టు సీజేగా నియమించారు.
రాజస్తాన్ హైకోర్టులో జడ్జి జస్టిస్ అరుణ్ భన్సాలీని అలహాబాద్ హైకోర్టు సీజేగా నియమించారు. మద్రాస్ హైకోర్టులో జడ్జి జస్టిస్ ఎస్. వైద్యనాథన్‌ను మేఘాలయ హైకోర్టుకు సీజేగా నియమించారు
Published date : 03 Feb 2024 01:23PM