Anganwadi Employees Complaint : రాష్ట్రపతికి అంగన్వాడీ సమస్యల లేఖ.. కారణం..!!

కాకినాడ సిటీ: అంగన్‌వాడీ సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం పదేళ్లుగా నిర్లక్ష్యం చూపడాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ జిల్లాలోని 4 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు లేఖలు పంపించాలని నిర్ణయించారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మావతి, ఏరుబండి చంద్రవతి ఈ విషయం తెలిపారు.
2022లో సుప్రీంకోర్టు ఆదేశం..
కాకినాడ సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు ఈ వివరాలు తెలిపారు. అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ చెల్లించాలని, నాలుగో తరగతి ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని 2022లో సుప్రీంకోర్టు ఆదేశించింది, అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఈ తీర్పును కూడా బేఖాతరు చేస్తోందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రపతికి లేఖలు రాస్తున్నామని తెలిపారు.
Karnataka Swimmers: జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లకు.. చెరో తొమ్మిది పసిడి పతకాలు
అమలు కాలేదు..
అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వహించే ఐసీడీఎస్ బడ్జెట్‌నే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కుదిస్తోందన్నారు. దీనివల్ల పేద పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 42 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం రాసిచ్చిన మినిట్స్ కాపీలో అన్నింటినీ అమలు చేస్తామని చెప్పిన కూటమి నాయకులు.. అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా మట్టి ఖర్చులు మినహా ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు.
ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, యాప్‌ల భారాన్ని తగ్గించాలనే డిమాండ్లతో ఈ నెల 17, 18, 19 తేదీల్లో అన్ని ప్రాజెక్టు ఆఫీసుల ముందు ఆందోళనలు చేస్తామని పద్మావతి, చంద్రావతి తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Anganwadi Workers
- complaint to president
- AP Anganwadi Workers
- central government
- ICDS Budget
- Anganwadi system
- development in anganwadi
- Project Officers
- Anganwadi Workers Demands
- minutes copy
- mother and childrens at anganwadis
- Central Govt Schemes
- anganwadi workers complaint to president
- Supreme Court Order
- CITU Office
- Education News
- Sakshi Education News