Skip to main content

50th Anniversary Celebrations : ఇష్టంతో చదవడం ద్వారా సత్ఫలితాలు సాధించండి: ఎస్పీ సతీష్‌కుమార్ సూచనలు"

చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
50th anniversary celebrations at secondary campuses

గుంటూరు ఎడ్యుకేష‌న్: చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శ్యామలానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ పాఠశాలలో మంగళవారం మిడిల్‌, సెకండరీ క్యాంపస్‌ల 50వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

Intermediate Practical Examinations: నేటి నుంచే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు..

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ, విద్యను ఒక మూస పద్ధతిలో కాకుండా, పిల్లల అభిరుచికి అనుగుణంగా సృజనాత్మకంగా నేర్పించాల్సిన అవసరాన్ని వివరించారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాలని, చదువును ఒక రసాయనంగా కాకుండా ఆనందంగా తీర్చిదిద్దాలని సూచించారు.

జై జ‌వాన్‌.. జై కిసాన్‌..

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు తమ గురువులు, తల్లిదండ్రులను గౌరవించాలని, జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రస్తావించారు. పాఠశాల సీఏవో దుర్గా రఘురామ్‌ మాట్లాడుతూ, శాంతి, ఆరోగ్యం, సహకారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని అత్యవసరాలకే పరిమితం చేయాలని సూచించారు.

13,762 Posts Recruitments : ఎన్‌ఆర్‌డీఆర్‌ఎంలో 13,762 ఖాళీలు.. ఎంపికైతే వేల‌ల్లో జీతాలు.. పోస్టుల వివ‌రాలివే..

అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు, ప్రిన్సిపల్‌ సుధామాధవి, వైస్‌ ప్రిన్సిపల్స్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 05 Feb 2025 12:56PM

Photo Stories