Skip to main content

PM Modi: గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు?

PM Modi-Ganga Express way

ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల మీదుగా సాగే ప్రతిష్టాత్మక ఆరు వరసల గంగా ఎక్స్‌ప్రెస్‌వే రహదారి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 18న షాజహాన్‌పూర్‌ జిల్లాలోని,  షాజహాన్‌పూర్‌ సమీపంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... రూ. 36,230 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఉత్తరప్రదేశ్‌ వాయవ్య ప్రాంత జిల్లాల భవిష్యత్‌ రూపురేఖలు మారిపోతాయాని పేర్కొన్నారు. జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటక రంగాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయన్నారు. మీరట్, హర్‌పూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదాయూ, షాజహాన్‌పూర్, హర్‌దోయీ, ఉన్నవ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్‌.. మొత్తంగా 12 జిల్లాల గుండా  594 కి.మీ.ల పొడవైన ఆరు వరసల రహదారిని నిర్మించనున్నారు.

చ‌ద‌వండి: యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ పండుగ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆరు వరసల గంగా ఎక్స్‌ప్రెస్‌వే రహదారి పనులకు శంకుస్థాపన 
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : షాజహాన్‌పూర్‌, షాజహాన్‌పూర్‌ జిల్లా
ఎందుకు : ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటక రంగాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Dec 2021 04:08PM

Photo Stories