Intangible Heritage: యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ పండుగ?
ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్–UNESCO) కోల్‌కతా దుర్గా పూజను మావనజాతి ‘వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని డిసెంబర్ 15న యునెస్కో తెలిపింది. తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ (ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్- ఐసీహెచ్) కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆసియాలో ఓ పండగకు ఇలాంటి గుర్తింపు రావడం ఇదే ప్రథమం. పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా దుర్గా పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
డిజిటల్ చెల్లింపులకు మరింత మద్దతు
దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ఇప్పటికే గరిష్టాలకు చేరుకోగా.. వీటిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు యూపీఐ, రూపే డెబిట్ కార్టులతో చేసే చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్ల పథకానికి డిసెంబర్ 15న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వ్యక్తులు వర్తకులకు చేసే డిజిటల్ చెల్లింపులకు అయ్యే వ్యయాలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది కాలంలో ప్రభత్వం రూ.1,300 కోట్లను ఖర్చు చేయడం వల్ల మరింత మంది డిజిటల్ చెల్లింపులకు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మావనజాతి ‘వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ’ జాబితాలోకి కోల్‌కతా దుర్గా పూజ
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్–UNESCO)
ఎందుకు : కోల్‌కతా దుర్గా పూజకు ఎంతో ప్రాధాన్యత ఉన్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్