NCRB: దేశంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రం?
దేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 2020 ఏడాదిలో 185, 2019 ఏడాదిలో 111 బాల్య వివాహాలు కర్ణాటకలో నమోదయ్యాయి. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తెలిపిన సమాచారం ప్రకారం... కర్ణాటక బాల్య వివాహాల్లో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో అస్సాం –138 వివాహాలు, పశ్చిమ బెంగాల్– 98, తమిళనాడు –77 ఉన్నాయి.
‘ఈ–సంజీవని’లో ఏపీకి అగ్రస్థానం
జాతీయ టెలీ మెడిసిన్ సేవ ఈ–సంజీవనిలో 37,04,258 సంప్రదింపులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర కుటుంబ,ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. ఏపీ తరువాత కర్ణాటక (22,57,994), తమిళనాడు (15,62,156), ఉత్తరప్రదేశ్ (13,28,889), గుజరాత్ (4,60,326), మధ్యప్రదేశ్ (4,28,544), బిహార్ (4,04,345), మహారాష్ట్ర (3,78,912), పశ్చిమ బెంగాల్ (2,74,344), కేరళ (2,60,654) ఉన్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ–సంజీవని ప్రారంభించిన తరువాత దీన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే.
15 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
2021 ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో 15 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కానున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇది గడిచిన ఐదేళ్ల సగటు కంటే 1.2 కోట్ల టన్నులు అధికం. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా నరేంద్ర తోమర్ ఉన్నారు.
చదవండి: అంతర్జాతీయ నవకల్పనల సూచీలో భారత్ ర్యాంకు?