Delhi-Mumbai Expressway: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే తొలి దశ ప్రారంభం
దేశంలో అతి పెద్దదైన జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవే ఢిల్లీ–ముంబై మహా రహదారిలో 246 కి.మీ. భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12వ తేదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని సోహ్నా నుంచి రాజస్తాన్‌లో దౌసా మధ్య నిర్మాణం జరుపుకున్న తొలి దశను దౌసా వద్ద రిమోట్ కంట్రోల్ బటన్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. 8 లేన్లతో నిర్మించిన ఢిల్లీ–దౌసా–లాస్‌సాట్ రహదారి అందుబాటులోకి రావడంతో ఢిల్లీ, జైపూర్ మధ్య దూరం సగానికి సగం తగ్గిపోతుంది. ఇన్నాళ్లు 5 గంటలు పట్టే ప్రయాణం ఈ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళితే మూడున్నర గంటలే పడుతుంది. దీంతోపాటు రూ.5,940 కోట్ల జాతీయ హైవే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం హైవే ప్రాజెక్టులు, పోర్టులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్, మెడికల్ కాలేజీల మీద అత్యధికంగా దృష్టి సారించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.
దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలు
ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలను మోదీ ఫిబ్రవరి 12వ తేదీ ప్రారంభించారు. ఆయన చూపిన మార్గం కోట్లాది మందిలో ఆశల్ని నింపుతోందని ఈ సందర్భంగా ఆయనన్నారు. నిరుపేదలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అణగారిన వర్గాల అభ్యున్నతి మొట్టమొదటి యజ్ఞంగా చేపట్టామని తెలిపారు.
Train Passengers: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ నుంచే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే విశేషాలు
మొత్తం పొడవు: 1,380 కి.మీ.
మొత్తం వ్యయం: దాదాపుగా రూ. లక్ష కోట్లు
ఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయం: 12 గంటలు
(ప్రస్తుతం 24 గంటలు పడుతోంది)
తొలి దశ పొడవు : 246 కి.మీ. (సోహ్నా నుంచి దౌసా)
వ్యయం: రూ.12,150 కోట్లు
• ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం. (ఇన్నాళ్లూ 5 గంటలు పట్టేది. ఇకపై మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు) .
• ఆరు రాష్ట్రాల మీదుగా వెళ్లనున్న ఎక్స్‌ప్రెస్ వే