Train Passengers: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ నుంచే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
Sakshi Education
రైల్వే ప్రయాణికులు త్వరలో వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనం ఆర్డర్ చేయొచ్చు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేయొచ్చు. ఇప్పటికే కొన్ని నిర్దిష్ట రూట్లలో ఐఆర్సీటీసీ +91 8750001323 ఫోన్ నంబర్‌పై వాట్సాప్ ద్వారా మీల్స్ అందిస్తున్నది. ఈ కేటరింగ్ సేవల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్‌సైట్ www.catering.irctc.co.inతో పాటు ఈ–కేటరింగ్ యాప్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపింది. ఇ–టికెట్ బుక్ చేసుకుని, ఇ–కేటరింగ్ సేవలకు ఆప్షన్ ఇచ్చిన ప్రయాణికులకు వాట్సాప్ నంబర్ నుంచి మెసేజీ వెళ్తుంది. దాని ద్వారా ఆ మార్గంలోని స్టేషన్లలో నచ్చిన రెస్టారెంట్లలో మీల్స్ బుక్ చేసుకోవచ్చు.
Vande Bharat Trains: అందుబాటులోకి మరో మూడు వందే భారత్ రైళ్లు
Published date : 07 Feb 2023 01:18PM