Skip to main content

Rahul Gandhi: రాహుల్‌గాంధీకి మ‌ళ్లీ నిరాశే... త‌రువాతి స్టెప్ ఏంటి...?

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.
Rahul Gandhi
రాహుల్‌గాంధీకి మ‌ళ్లీ నిరాశే... త‌రువాతి స్టెప్ ఏంటి...?

‘రాహుల్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఆయనకు కిందికోర్టు శిక్ష విధించడం సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదు. అందుకే పిటిషనర్‌ అభ్యర్థనను కొట్టివేస్తున్నాం’ అని జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ తీర్పు వెలువరించారు.

☛ ఇంట‌ర్ ఫస్టియర్‌, సెకండియర్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలు విడుద‌ల‌.. ఎంత‌మంది పాస్ అయ్యారంటే..

జైలు శిక్షపై స్టే ఇవ్వకపోవడంతో రాహుల్‌పై అనర్హత వేటు కొనసాగనుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్‌ హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అనే భావ‌న వ్యక్త‌మ‌వుతోంది. అయితే శిక్ష అమలును హోల్డ్‌ చేస్తూ గతంలో న్యాయస్థానం ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. 

☛ వరల్డ్ కప్‌లో భారత్ ఆడ‌నున్న మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే...

దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజా తీర్పుపై సుప్రీంకు వెళ్ల‌నున్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. 

Published date : 07 Jul 2023 03:25PM

Photo Stories