Skip to main content

G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు

అంతర్జాతీయంగా భారత్‌ పలుకుబడి, పేరు ప్రతిష్టలు కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. దేశాల మధ్య అతి జటిలమైన సమస్యల పరిష్కారానికైనా, వివాదాల్లో మధ్యవర్తిత్వానికైనా అన్ని దేశాలూ భారత్‌ వైపే చూసే పరిస్థితి!
G20 Summit 2023
G20 Summit 2023

ఇప్పుడు జీ20 శిఖరాగ్రానికి భారత్‌ వేదికగా నిలుస్తుండటాన్ని అందుకు కొనసాగింపుగానే భావిస్తున్నారు. మన దేశ వ్యవహార దక్షతను నిరూపించుకోవడానికి మాత్రమే గాక అంతర్జాతీయ స్థాయిలో సంలీన వృద్ధి, సుస్థిర అభివృద్ధి సాధన యత్నాలకు అజెండా నిర్దేశించేందుకు కూడా ఇది చక్కని అవకాశంగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చిన వసుధైవ కుటుంబకం (ఒక వసుధ, ఒకే కుటుంబం, ఒకటే భవిత) నినాదమే సదస్సుకు మూలమంత్రంగా నిలవనుంది.

G20 Summits: జి20 సదస్సులు.. ఢిల్లీ లాక్ డౌన్

రెండు రోజులు.. మూడు సెషన్లు

► దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక ప్రగతి మైదాన్‌లో సదస్సు జరగనుంది.
► వేదికకు భారత్‌ మండపం అని నామకరణం చేశారు.
► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 7వ తేదీనే భారత్‌కు రానున్నారు. 8న మిగతా దేశాధినేతలు వస్తారు. దాంతో వారితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలకు కావాల్సినంత సమయం చిక్కనుంది.
► 8న బైడెన్‌తో మోదీ భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీ ఎజెండా ఏమిటన్నది ఇప్పటికైతే సస్పెన్సే.

India@2047: 2047 నాటికి అభివృద్ధి భారత్‌

తొలి రోజు ఇలా...

► సదస్సు 9న మొదలవుతుంది.
► ప్రతి దేశాధినేతకూ భారత్‌మండపం వద్ద మన సంప్రదాయ రీతుల మధ్య ఘన స్వాగతం లభించనుంది.
► రెండు రోజుల సదస్సులో మొత్తం మూడు సెషన్లు జరుగుతాయి.
► ఒకే వసుధ (వన్‌ ఎర్త్‌) పేరుతో తొలి సెషన్‌ శనివారం ఉదయం 9కి మొదలవుతుంది.
► దానికి కొనసాగింపుగా దేశాధినేతల మధ్య అధికార, అనధికార భేటీలుంటాయి.
► అనంతరం ఒకే కుటుంబం (వన్‌ ఫ్యామిలీ) పేరుతో రెండో సెషన్‌ మొదలవుతుంది.

Shiva Shakti Point: శివశక్తిగా చంద్రయాన్‌–3 ల్యాండర్‌ దిగిన ప్రాంతం

రెండో రోజు ఇలా...  

► సదస్సు రెండో రోజు ఆదివారం కార్యక్రమాలు త్వరగా మొదలవుతాయి.
► దేశాధినేతలంతా ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. గాందీజీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.
► అనంతరం భారత్‌ మండపం వేదిక వద్ద మొక్కలు నాటుతారు. పర్యావరణ పరిరక్షణకు పునరంకితం అవుతామని ప్రతినబూనుతారు.    
► ఒకే భవిత (వన్‌ ఫ్యూచర్‌) పేరిట జరిగే మూడో సెషన్‌తో సదస్సు ముగుస్తుంది.
► జీ20 అధ్యక్ష బాధ్యతలను వచ్చే ఏడాది శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్‌కు అప్పగించడంతో సదస్సు లాంఛనంగా ముగుస్తుంది.

ప్రథమ మహిళల సందడి  

► జీ20 సదస్సులో ఆయా దేశాధినేతల సతీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
► పలు ప్రత్యేక కార్యక్రమాలతో సందడి చేయనున్నారు.
► శనివారం తొలి రోజు వాళ్లు పూసా లోని వ్యవసాయ పరిశోధన సంస్థ, నేషనల్‌ మోడర్న్‌ ఆర్ట్‌ గ్యాలరీ సందర్శిస్తారు.
► తృణ ధాన్యాల పరిరక్షణ, వృద్ధిలో భారత్‌ చేస్తున్న కృషిని స్వయంగా గమనిస్తారు.
► చివరగా పలు రకాల షాపింగులతో సేదదీరుతారు.
► రెండో రోజు ఆదివారం దేశాధినేతల అనంతరం వాళ్లు కూడా రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు.

PM Vishwakarma: ‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం

మరెన్నో విశేషాలు...

► ప్రతినిధుల షాపింగ్‌ కోసం క్రాఫ్ట్స్‌ బజార్‌ పేరిట వేదిక వద్ద జీ20 జాబ్‌ ఫెయిర్‌ ఏర్పాటు చేస్తారు.
► ప్రజాస్వామ్యాలకు తల్లి భారత్‌ థీమ్‌తో çహాల్‌ నంబర్‌ 14లో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తారు.  
షడ్రసోపేత విందు
► శనివారం తొలి రోజు సదస్సు అనంతరం రాత్రి ఆహూతులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా విందు ఇవ్వనున్నారు.
► ఇందులో దేశాధినేతలు మొదలుకుని రాయబారులు దాకా 400 మంది దాకా పాల్గొంటారు.
► విందు కూడా అధినేతల చర్చలకు వేదిక కానుంది. కాన్ఫరెన్స్‌ గదుల రొటీన్‌కు దూరంగా ఆరుబయట వారంతా మనసు విప్పి మాట్లాడుకుంటారు.

Delhi ordinance bill passed in Lok Sabha: ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు ఆమోదం

Published date : 05 Sep 2023 01:44PM

Photo Stories