Shiva Shakti Point: శివశక్తిగా చంద్రయాన్–3 ల్యాండర్ దిగిన ప్రాంతం
Sakshi Education
చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 ల్యాండర్ దిగిన ప్రాంతం ఇకపై ‘శివశక్తి’ పేరుతో ఖ్యాతికెక్కనుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఇస్రో సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా ల్యాండింగ్ జరిగిన రోజు(ఆగస్ట్ 23వ తేదీ)ను ఇకపై జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
chandrayaan-3 Benifits: chandrayaan-3 ప్రయోజనాలు
చంద్రయాన్–3 విజయవంతమైన సందర్భంగా బెంగళూరులో ఇస్రో వారి టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ సెంటర్‌లో ఇస్రో శాస్తవేత్తలను కలిశారు. విజయం కోసం అహర్నిశలు శ్రమించిన వారిని మనసారా అభినందించారు. వారి సమక్షంలో భావోద్వేగంతో మాట్లాడారు. ‘ భారత అంతరిక్ష ప్రయోగాల పథాన్ని ఈ విజయం నిజంగా అసాధారణమైన ఆనందంతో నింపేసింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని ‘శివశక్తి’గా, 2019లో చంద్రయాన్–2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్‌గా పిలుచుకుందాం.
Chandrayaan-3: జయహో భారత్... చంద్రయన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్
Published date : 28 Aug 2023 12:52PM