Skip to main content

G20 Summits: జి20 సదస్సులు.. ఢిల్లీ లాక్ డౌన్

జీ 20 అంటే గ్రూప్ ఆఫ్ 20. పరస్పర ఆర్థిక సహకారం కోసం ఈ గ్రూపు 1999లో అవతరించింది . 1999లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అగ్ర దేశాల మధ్య ఆర్థిక సహకారం కోసం ఈ గ్రూప్ 20 ఏర్పాటు చేశారు.
G20 Summits, economic stability and collaboration
G20 Summits

ఈ గ్రూపులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్యులు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, టర్కీ, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా తోపాటు యూరోపియన్ యూనియన్ సభ్యులుగా  ఉన్నారు.
అనతి కాలంలోనే , ఇది కేవలం ఆర్థిక అంశాలపైనే కాకుండా తన ఎజెండాను విస్తరించుకుంది. కొత్తగా వాణిజ్యం, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పులు, అవినీతి నిరోధక చర్యలు ఈ అంశాల పైన పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ జీ20 దేశాల గ్లోబల్ జిడిపి ప్రపంచంలో 85% గా ఉంది. ప్రపంచ వ్యాపారంలో 75 శాతం ఈ దేశాల వాటా ఉంది. అలాగే ప్రపంచ జనాభాలో మూడింట రెండో వంతు జనాభా  జి-20 ఈ దేశాల్లోని నివసిస్తుంది. అందుకే ఈ దేశాల సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.

India@2047: 2047 నాటికి అభివృద్ధి భారత్‌

లోపాలున్నాయ్‌

అయితే ఈ జీ 20 కి సొంత సచివాలయం లేకపోవడం ఒక పెద్ద మైనస్. 24 ఏళ్ల కిందట ఈ జీ 20 గ్రూప్ ను స్థాపించిన ఇప్పటికీ సెక్రటేరియట్ లేదు. ఈ గ్రూపు నిర్ణయాలను తప్పని సరిగా అమలు చేయాలని చట్టబద్ధత లేదు. ఈ సదస్సులో  పరస్పర ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలను అమలు చేయకపోతే పెద్దగా ఎలాంటి ఆంక్షలు గాని శిక్షలు గాని లేవు. 

వసుధైక కుటుంబం అనే  జి-20 సదస్సుకు భారత నాయకత్వం

వసుదైవక కుటుంబం అనే నినాదంతో జి20 సదస్సుకు భారత నాయకత్వం వహిస్తోంది.  ప్రపంచమంతా కుటుంబం అనే  భావన మన సంస్కృతిలో ఉంది అనే అంశాన్ని తెలియజేసే క్రమంలో భాగంగా ఈ నినాదాన్ని దీనికి ట్యాగ్లైన్ గా ఉంచారు. ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే లక్ష్యంతో జి20 సదస్సును భారత నిర్వహిస్తోంది. భారత సంస్కృతి సాంప్రదాయాల్లోని విలువల ఆధారంగానే ఈ జి20 శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూనే ఈ ధరిత్రి సురక్షితంగా ఉంటుందని సందేశాన్ని భారత్ ఈ సందర్భంగా ప్రపంచానికి చాటుతోంది.

ప్రతి ఏడాది రొటేషన్ పద్ధతిలో ఒక సభ్య దేశం g20 కి నాయకత్వం వహిస్తోంది. అందులో భాగంగా గత డిసెంబర్ నుంచి భారత్ ఈ గ్రూప్ కు చైర్మన్ గా వ్యవహరిస్తోంది.  భారత్ జి20 చైర్మన్గా కొనసాగుతూ  సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేసి సభ్య దేశాలతో ఏడాది పొడవున సమావేశాలు నిర్వహించింది. ఫైనల్ గా సెప్టెంబర్ 9 10 తేదీల్లో శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది.
ఏడాది జి20 చైర్మన్గా భారత్ రెండు ట్రాక్ ల పై ప్రధానంగా పని చేసింది.. ఒకటి ఫైనాన్షియల్ ట్రాక్, రెండోది షేర్పా ట్రాక్. ఆర్థిక అంశాలపై ఆయా దేశాల ఆర్థిక మంత్రులు నేరుగా చర్చలు జరుపుతారు. షేర్పా ట్రాక్ వర్కింగ్ గ్రూప్ లో వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు  ఏడాది పొడవున వివిధ  సదస్సులు నిర్వహిస్తారు. 

Amrit Bharat station Scheme: రూ.24,470 కోట్లతో రేల్వేస్టేషన్ల పునర్నిర్మాణం

ఇవే కాకుండా ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ద్వారా  సివిల్ సొసైటీస్, పార్లమెంటేరియన్స్ ,బ్థింక్ ట్యాంక్స్, మహిళ ,యువత, లేబర్, బిజినెస్, రీసర్చ్ తో ఈ గ్రూప్ 20 చర్చలు జరుపుతుంది వీటిని ఎంగేజ్మెంట్ గ్రూప్స్ గా పిలుస్తారు.
ఈ జీ20 సదస్సును భారత్ తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకునేందుకు ఉపయోగించుకుంటుంది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ అతి త్వరలోనే మూడో స్థానానికి ఎదగాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి అవసరమైన సహకారాన్ని జి20 సదస్సు ద్వారా భారత్ పొందనుంది. గతంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా వెలుగొందిన భారత్, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Japan Foreign Minister: స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు భారత్‌ కీలకం 

రష్యా , చైనా దేశాల అధ్యక్షుల గైర్హాజరు దేనికి సంకేతం ?

రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జి 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం లేదు. ఈ రెండు దేశాల అధ్యక్షులు హాజరు కాకపోవడం వెనుక కారణాలపై  రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పాశ్చాత్య దేశాల వైఖరిపై   అధ్యక్షుడు పుతిన్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రష్యా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్న ఉక్రెయిన్ కు వెస్ట్ కంట్రీస్  అండగా నిలబడడంపై ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పుతిన్ పై యుద్ధ నేరాలకు గాను అరెస్ట్ ఆఫ్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు రష్యాలో సైతం అంతర్గతంగా పరిస్థితులు కత్తి మీద సాములా ఉన్నాయి. ఇటీవల పుతిన్ తిరుగుబాటుదారు ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఇలాంటి సున్నిత పరిస్థితుల మధ్యలో ఉతిన్ రష్యా దాటి బయటికి వచ్చే సాహసం చేయడం లేదు ఆయన బదులుగా విదేశాంగ శాఖ మంత్రి లాబ్రోస్ను G20 సదస్సుకు పంపుతున్నారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పై  జి20 డిక్లరేషన్ చేస్తే దాన్ని బ్లాక్ చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. 
మరోవైపు చైనా అధ్యక్షుడు జింపింగ్ సైతం తన బదులు ప్రీమియర్ కి లియాంగును జి20 సదస్సుకు పంపుతున్నారు. ఈ రెండు ప్రముఖ దేశాల అధ్యక్షులు g20 సదస్సుకు డుమ్మా కొట్టడం వెనుక పాశ్చాత్య దేశాల వైఖరి కారణం అనే చర్చ జరుగుతుంది. అలాగే చైనా కూడా ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ ను తన మ్యాప్ లో చూపించడం, లద్దక్ సరిహద్దుల్లో దురాక్రమణులకు ప్రయత్నించడాన్ని భారత్ తిప్పికొట్టింది. ఈ పరిణామాలు నేపథ్యంలో జిన్ పింగ్ జి20 సదస్సుకు ముఖం చాటేస్తున్నారు. 

PM Vishwakarma: ‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం

సర్వాంగ సుందరంగా ఢిల్లీ 

జి20 సదస్సుకు ఢిల్లీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పచ్చదనం పరిశుభ్రత పెద్దపీట వేశారు. రోడ్లకు ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్ చేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జి20 సదస్సు జరిగే భారత మండపం వరకు పరిసరాలన్నిటిని అలంకరించారు. కోట్ల రూపాయల ఖర్చుపెట్టి భారత ప్రతిష్టను చాటేలా తయారు చేశారు. రోడ్లకు ఇరువైపులా జి20 దేశాల జెండాలు నిలబెట్టారు. భారతదేశ కళావైభవ చిహ్నాలు అన్నిటిని రోడ్ల ముఖ్య కూడలిలో అందంగా అమర్చారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళారూపాల ఫ్లెక్సీలను విమానాశ్రయం వద్ద ప్రదర్శన గా పెట్టారు. ఢిల్లీకి వచ్చే అతిధులకు కనుల విందుగా పరిసరాలన్నిటిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ డెకరేషన్స్  చేశారు. 
జీ 20 సదస్సును ప్రగతి మైదాన్ లోని భారత మండపంలో నిర్వహిస్తున్నారు. కర్ణాటక బసవేశ్వరుడి అనుభవం మండపం స్ఫూర్తితో  భారత మండపం అని నామకరణం చేశారు. దాదాపు 3 వేల కోట్ల రూపాయలతో ఈ భారత మండపం నిర్మాణం జరిగింది. భారతదేశానికి సంబంధించిన సంస్కృతి కళా వైభవాన్ని ఉట్టిపడేలా భారత మండపాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 25 అడుగుల ఎత్తు ఉన్న నటరాజ విగ్రహాన్ని ఈ మండపంలో ప్రత్యేకంగా ప్రతిష్టించారు. ఈ మండపం మొత్తానికి ఇదే ఒక పెద్ద హైలెట్గా నిలవబోతోంది.
దీనితోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వ  వైభవ  చిహ్నాలను ఇందులో అమర్చారు. ప్రజాస్వామ్యానికి భారతదేశమే తల్లి లాంటిది అనే విషయానికి గుర్తుగా మన ఋగ్వేదంలో ఉన్న విషయాలను ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. బసవేశ్వరుడి అనుభవ మండపం కూడా ప్రజాస్వామ్య విలువలకు ఒక ప్రతిరూపంగా నిలుస్తుందని ఉద్దేశంతో ఆ పేరుతోనే ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కి నామకరణం చేశారు. సాంస్కృతిక వైభవంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అధునాతన సౌకర్యాలను ఈ భారత మండపంలో మేళవించారు. ఈ జీ20 సదస్సులో ఈ సమావేశ మందిరం భారత సంస్కృతికి ఒక ప్రతీక గా నిలవబోతోంది.   

Highest Pollution City in the World: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ

జి 20 సదస్సుకు కనీవిని ఎరుగని భద్రత 

భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జీ20 శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తోంది. ఏ చిన్న ఆటంకం అంతరాయం లేకుండా అతిధులకు సౌకర్యాలు కల్పించేందుకు సమావేశాలు విజయవంతంగా జరిగేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేసింది. అతిధుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. దాదాపు లక్షన్నరమంది సెక్యూరిటీ సిబ్బంది జి20 సదస్సు కోసం పనిచేస్తున్నారు. ప్రతి 100 అడుగులకు ఒక సాయుధ పోలీసును విధుల్లో ఉంచారు. సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో సెంట్రల్ ఢిల్లీ పూర్తిగా లాక్ డౌన్ లో ఉండనుంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు , దుకాణాలు, మా, స్కూలు, కాలేజీలు అన్నిటిని మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 
అమెరికా అధ్యక్షుడు జో బై డెన్ ,  బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సహా 24  దేశాధినేతలు సమావేశాలకు హాజరుకానున్నారు. వీరి భద్రత పోలీసులకు ఒక పెద్ద సవాల్ గా మారింది. ఇందుకోసం గత వారం రోజుల నుంచి పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.

Digital Personal Data Protection Bill: వినియోగదారుల డిజిటల్‌ డేటాని దుర్వినియోగం చేసేవారిపై కేంద్రం కొరడా.. 

ఆ మూడు రోజులు ఢిల్లీ లాక్ డౌన్ ?

సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో ఢిల్లీ అనధికారిక లాక్ డౌన్ లోకి వెళ్లబోతోంది. ఢిల్లీకి వచ్చే దాదాపు 100కు పైగా రైళ్లను ఈ మూడు రోజుల్లో రద్దు చేశారు. అలాగే విమాన రాకపోకలు సైతం రద్దు చేశారు. ఈ మూడు రోజులపాటు పరిమిత సంఖ్యలోనే విమానాలు రైళ్ల రాకపోకలు ఢిల్లీలో కొనసాగుతాయి. కీలక దేశాధినేతల రాకపోకలు నేపథ్యంలో అనేక ఆంక్షలను అమలు చేస్తున్నారు. సామాన్య ప్రజల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇక సెంట్రల్ ఢిల్లీ పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మారబోతోంది. కేవలం సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారు మినహా మిగిలిన వారెవరిని సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతించడం లేదు. దేశాధినేతల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ మూడు రోజులపాటు ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఫైవ్ స్టార్ హోటల్స్ కిటకిట, ఖరీదైన కార్లకు గిరాకీ

జి20 దేశాల అధినేతలు, ప్రపంచ  ఆర్థిక సంస్థల నేతలు ఢిల్లీకి తరలి వస్తుండడంతో ఫైవ్ స్టార్ హోటల్స్ కిటకిటలాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడన్కు ఐటిసి మౌర్యలో బస ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా దేశాల ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఢిల్లీకి చేరుకొని తమ అధినేతల  రాకపోకల ఏర్పాటు చేసుకుంటున్నారు.  ఈ సదస్సు కోసం ప్రత్యేకించి వేల సంఖ్యలో ఖరీదైన బీఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లను ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో కారు కోసం లక్ష రూపాయల అద్దె చెల్లించడానికి కూడా ప్రభుత్వం వెనకాడడం  లేదు. హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలిగే డ్రైవర్లను ఇందులో నియమిస్తున్నారు. 

President Murmu launches Vindhyagiri: యుద్ధ నౌక ‘వింధ్యగిరి’ జలప్రవేశం

 

Published date : 05 Sep 2023 09:54AM

Photo Stories