Amrit Bharat station Scheme: రూ.24,470 కోట్లతో రేల్వేస్టేషన్ల పునర్నిర్మాణం
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పునర్నిర్మించనున్న 1309 రైల్వేస్టేషన్ల పనులకు ఆదివారం ప్రధానమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా మొదట విడతలో 508 రైల్వే స్టేషన్ల పనులు మొదలుకానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.24,470 కోట్లను కేటాయించినట్లు తెలిపారు ప్రధాన మంత్రి.
మొదటి విడతలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లను తెలంగాణలోని 39 స్టేషన్లకు గాను మొదట 21 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ఏపీలోని రైల్వే స్టేషన్లకు రూ.453 కోట్లు తెలంగాణలోని రైల్వే స్టేషన్లకు రూ.893 కోట్ల నిధులతో రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల తరహాలో ప్లాజా మోడల్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మించనున్నారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్లను పునరుద్ధరించనున్నారు.
Amrit Bharat Station Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లకు మహర్దశ
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీలో కాకినాడ టౌన్ జంక్షన్, తుని, పిడుగురాళ్ల, రేపల్లె, తెనాలి, కర్నూలు సిటీ, దొనకొండ, ఒంగోలు, సింగరాయకొండ, పలాస, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం జంక్షన్, భీమవరం టౌన్, ఏలూరు, నరసపూర్, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం స్టేషన్లు.. తెలంగాణలో ఆదిలాబాద్, హనుమకొండ కాజీపేట జంక్షన్, హఫీజ్ పేట, హప్పుగూడ, హైదరాబాద్, మలక్ పేట, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్, మహబూబాబాద్ హైటెక్ సిటీ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, జహీరాబాద్, పెద్దపల్లి రామగుండం, మల్కాజిగిరి జంక్షన్, వికారాబాద్ తాండూరు, యాదాద్రి స్టేషన్లను ఆధునీకరించనున్నారు.
ఏపీ, తెలంగాణ మినహాయించి రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్ లో 21, జార్ఖండ్‌లో 20, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు.