Terrorism: ఉగ్రవాదానికి చోటు లేదు.. నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ
Sakshi Education
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 30వ తేదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్‌లో సంభాషించారు.
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు.
Bilateral Investment Treaty: ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం చేసుకున్న భారత్, ఉజ్బెకిస్తాన్
Published date : 01 Oct 2024 12:26PM