Delhi ordinance bill passed in Lok Sabha: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం
ఆర్డినెన్స్‌లో ఇలా..
ఢిల్లీలో పాలనాధికారం అసెంబ్లీకే ఉంటుందని.. అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ అక్కడి ప్రభుత్వానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మే 11న తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును పక్కన పెడుతూ మే 19న కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. నగర పాలనపై అసాధారణ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెడుతూ ఆర్డినెన్స్ జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్–ఏ అధికారుల పోస్టింగ్, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఢిల్లీలోని అధికారుల పోస్టింగ్, బదిలీలతోపాటు విజిలెన్స్ అధికారాలు ఎల్జీ చేతిలోకి వెళ్లాయి.
☛☛ Cinematograph (Amendment) Bill, 2023: సినిమాటోగ్రఫీ(చట్ట సవరణ) బిల్లు–2023
నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీకి చైర్మన్‌గా ఢిల్లీ సీఎం ఉంటారు. మెంబర్లుగా సీఎస్, హోంశాఖ కార్యదర్శి ఉంటారు. ఢిల్లీలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఈ ముగ్గురు సమావేశమై, ఓటింగ్ నిర్వహించి ఎల్జీకి నివేదించాలి. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్ గవర్నర్‌దే తుది నిర్ణయంగా ఉంటుంది. నగరంలోని పోలీస్ వ్యవస్థ మొత్తం ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉంది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం ఎల్జీదే. సివిల్ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్‌తో ఆ అధికారాలు కూడా లేకుండా పోతాయి.
☛☛ Lok Sabha passes Jan Vishwas Bill: లోక్‌సభలో జన్ విశ్వాస్ బిల్లు ఆమోదం